Others

అందమైన విపరీతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో గ్లామర్ కల్చర్ పీక్స్‌కి చేరుతోంది. కెమిస్ట్రీని గొప్పగా పండించి, ఆడియన్స్‌ను థియేటర్లకు
రప్పించేందుకు దేనికైనా
సిద్ధమేనంటున్నారు హీరోయిన్లు. ఎలాంటి సంకోచాలు లేకుండా -పాత్రల పరిధిదాటి గ్లామర్ ప్రదర్శించేందుకు మేమెప్పుడూ సిద్ధమేనంటూ సంకేతాలిస్తున్నారు.
హీరోయిన్ల మధ్య అవకాశాల కోసం పోటీ ఎక్కువైంది. మరోవైపు వచ్చిన అవకాశాన్ని పదిలపర్చుకోవడమూ కష్టమవుతోంది. సో.. చాన్స్ చేజార్చుకోకుండా ఉండాలంటే కంచె దాటి గ్లామర్‌ను ప్రదర్శించాలన్న నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తోంది. గ్లామర్ రోల్స్ చేసే విషయంలో ఏదోక తెగింపునకూ సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ -అందమైన విపరీతానికి సంకేతాలుగానే కనిపిస్తున్నాయి. హీరోయిన్లు శృతి మించుతున్నారన్న భావనను కలిగిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్‌లో వస్తున్న చిత్రాలు కొన్నింటిని పరిశీలిస్తే -ఒకరిని మించి ఒకరు అందాల ఆరబోతకు సిద్ధమవుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇదంతా.. ప్రాజెక్టు సక్సెస్‌కు, ప్రేక్షకుల వినోదానికేనంటూ హీరోయిన్లు ‘పాత్ర’ను బోర్లించి మరీ చెబుతున్నారు. ఇటీవల వస్తున్న సినిమాలను ఉదహరించుకుంటే -గ్లామర్ ప్రదర్శన విషయంలో రోజురోజుకూ బాలీవుడ్ డోస్ పెంచుతున్నట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు ‘బికినీ’ సీన్‌కు భయపడిన హీరోయిన్లు, ఇప్పుడు వాటిని కామన్‌గా చేసేస్తున్నారు. బికినీ సన్నివేశాలను మించి ‘న్యూడ్ షో’లను పాపులర్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సంచలనానికి సెంటర్ పాయింట్‌గా మారిన రాధికా ఆప్టేను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.
ఒక్కసారి బాలీవుడ్ ‘గ్లామర్’ ప్రదర్శనలను సింహావలోకనం చేసుకుంటే -హీరోయిన్ అందాలను అంతర్లీనంగా బహిర్గతం చేసిన ఫస్ట్ షోమాన్‌గా రాజ్‌కఫూర్‌ను ప్రస్తావించుకోవాలి. శృతిమించిన అందాలను సన్నివేశంలో బలంగా మిళతం చేసి -విమర్శకు తావులేని గ్లామర్‌ను ప్రేక్షకుడికి అందించిన ‘షో’మాన్ రాజ్‌కఫూరే. వానలో తడిసి ముద్దవ్వాల్సిన హీరోయిన్ మేని సొగసుపై ఒక్క తెల్లచీరను మాత్రమే చుట్టి -సన్నివేశాలకు కొత్త అందాలను ఆపాదించి చూపించాడు రాజ్‌కఫూర్. బాలీవుడ్ మాస్టర్ పీస్ ‘మేరానామ్ జోకర్’తో మొదలైన ఈ తరహా దృశ్యచిత్రణ -ఇప్పటి బాలీవుడ్ న్యూడ్ షోలకు ఆద్యమని చెప్పాలి. బాబీ, రామ్ తేరి గంగా మెయిలీ, సత్యం శివం సుందరంలాంటి హిట్టు చిత్రాల్లో -హీరోయిన్ల సొగసుకు తన మార్క్ జోడించి అద్భుతాలనే ఆడియన్స్‌కు అందించాడు రాజ్‌కఫూర్. ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ సన్నివేశాల్లో కనిపించేందుకు అప్పటి హీరోయిన్లూ గట్స్‌ను ప్రదర్శించారనే చెప్పాలి. అక్కడి నుంచే నాభి సౌందర్యం నుంచి వొంటి ఒంపుసొంపులన్నీ ఆన్ స్క్రీన్‌మీద ఆరబోసేందుకు తెగువ చూపించే హీరోయిన్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. న్యూడ్ ఫొటో షూట్‌లతో మ్యాగజైన్ కవర్లకెక్కి సంచలనం సృష్టించిన హీరోయిన్లలో మమతా కులకర్ణి, పూజాభట్‌లను ప్రస్తావించుకోవాలి. ‘మీనాక్షి -ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్’ చిత్రం కోసం అధికారిక పోస్టర్‌పైనే బ్యాక్‌లెస్ పోజుతో టబు సంచలనం సృష్టిస్తే, ‘సాగర్’ చిత్రంలో బీచ్‌లో నోరెళ్లబెట్టేలాంటి అందాలను ప్రదర్శించి నాలుగడుగులు ముందుకేసింది డింపుల్ కపాడియా. ‘జాన్‌బాజ్’లో అనిల్‌కఫూర్‌తో కెమిస్ట్రీ పండించేందుకు డింపుల్ చేసిన ‘అందమైన’ సాహసాన్ని ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఇక ‘అగ్ని వర్ష్’ చిత్రం కోసం టాప్‌లెస్ డ్రెస్‌తో నాగార్జునతో రవీనా టాండన్ సృష్టించిన ‘కిస్సింగ్’ సెనే్సషన్ చిన్నదేం కాదు.
బాలీవుడ్‌కు తన గ్లామర్‌తో కొత్తందాన్ని తీసుకొచ్చిన ఐశ్వర్య సైతం -లిప్తకాలం ‘న్యూడిటీ’ని రుచి చూపించిన హీరోయినే. సన్నివేశాన్ని రక్తికట్టించడానికి ‘మిస్ట్రెస్ అండ్ స్పీసెస్’ చిత్రంలో టాప్‌లెస్ టేస్ట్‌ని ఆడియన్స్‌కి అందించింది. బెంగాలీ డ్రామా ‘చోకర్ బాలీ’లో రెచ్చగొట్టే వొంపుసొంపుల పోజులతో ‘అందాల ఆరబోత’ చర్చకు తెరలేపింది. చాలా చిత్రాల్లో సెన్సార్ కత్తెర్లతో అలాంటి దృశ్యాలు ఆన్ స్క్రీన్ వరకూ రాకపోయినా, పోస్టర్లపై దర్శనమిచ్చి ఆడియన్స్‌ని ఆలోచనల్లో పడేశాయని చెప్పడానికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఇక తాజా చిత్రాలను పరిశీలిస్తే -‘గ్యాంగ్‌స్టర్’లో కటిభాగం చుట్టూ శాటిన్ క్లాత్ చుట్టుకుని రెచ్చగొట్టిన కంగానా రనౌత్‌ను ప్రస్తావించుకోవాలి. మాధుర్ బండార్కర్ చిత్రం ‘జైల్’లో నీల్ నితిన్ ముఖేష్ చేసిన ‘న్యూడ్’ సీన్ ఎవరు మాత్రం మర్చిపోతారు. సో.. షోమాన్ రాజ్‌కఫూర్ హీరోయిన్ల నుంచి మొదలైన ‘సెమి న్యూడ్ షో’.. ఇప్పుడు ‘న్యూడ్ షో’ వరకూ వచ్చేశాయి.
తాజాగా మరో హీరోయిన్ ‘న్యూడ్’ స్టేట్‌మెంట్‌తో బాలీవుడ్‌లో మరోసారి సంచలనానికి తెరలేపింది. ‘అవును.. న్యూడ్‌గా నటిస్తే తప్పేంటి?’ అని ప్రశ్నించడమే కాదు, ఆ విషయంలో తనకెలాంటి ఆంక్షలు లేవని చెప్పడానికి తాజా ప్రాజెక్టులో ట్రెయిలర్ షో చూపిందట. ఆమె ఎవరో కాదు, సనాఖాన్. కొంతకాలం క్రితం నందమూరి తెలుగు ‘కత్తి’లో నందమూరి కళ్యాణ్‌రామ్‌తో జోడీకట్టిన సనాఖాన్‌కు, ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడా ఆశాజనకమైన కెరీర్ కనిపించకపోవడంతో -ఘాటు పెంచేందుకు ‘న్యూడిటీ’కి తెరలేపిందని అంటున్నారు. తాజా ప్రాజెక్టు -‘వాజహ్ తుమ్ హో’తో బాలీవుడ్ గ్లామర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని అంటున్నారు. ఇప్పటికే ట్రైలర్స్ దుమ్ము లేపుతున్నాయి. మరీ ఇంత గ్లామరా? అన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ, -ఉన్న అందాలే చూపిస్తున్నాం. అయినా న్యూడ్‌గా నటిస్తే తప్పేంటి? అంటూ ఘాటుగానే స్పందిస్తోందట. గ్లామర్ విషయంలో గేరు మార్చిన సనాఖాన్ -సినిమాలో ఏ రేంజ్ అందాలు ఆరబోసిందోనన్న ఆసక్తి అప్పుడే ఆడియన్స్‌లో కనిపిస్తోంది.

-ప్రవవి