Others

నివేదకు వర్కవుటైంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమా హిట్టయితే, అందులోనూ హీరో హీరోయిన్ల పెయిర్‌కు మంచి మార్కులు పడితే -వాళ్లిక లక్కీ పెయిర్‌గా మారిపోవడం ఖాయం. సేమ్ పెయిర్‌ను రిపీట్ చేయడానికి నిర్మాతలూ ఆసక్తి చూపిస్తారు. జెంటిల్‌మేన్‌లో నాని పక్కన సరైన కెమిస్ట్రీ పండించింది నివేదా థామస్. చురుకైన కదలికలతో అట్రాక్ట్ చేసి, నానితో సమానంగా నటించేసిన నివేదను మళ్లీ నాని సరసన చూపించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నార్ట. ఇందులో మొదటగా నిర్మాత డివివి దానయ్య తన ప్రయత్నాలు మొదలుపెట్టాడని వినికిడి. కొత్త దర్శకుడు శివశంకర్ దర్శకత్వంలో దానయ్య చేయబోతున్న తాజా ప్రాజెక్టులో నానికి జోడీకి నివేదను చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అంటే -ఒక్క సినిమాతోనే అభిమానుల సంఖ్య పెంచుకుని ‘జెంటిల్‌మేన్’కు సరైన జోడీగా నిలబడిన నివేద మళ్లీ మెప్పించబోతోందన్న మాట.