Others

భక్త మార్కండేయ (ఫ్లాష్‌బ్యాక్ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర మహాభాగవతంలో మార్కండేయుని వృత్తాంతం గోచరిస్తుంది. శివ వరప్రసాదిగా జన్మించి భక్తి ప్రపత్తులతో ఈశ్వరుని ఆరాధించి మృత్యువు కోరలనుంచి బయటపడిన భక్తవరేణ్యుడు మార్కండేయుడు. శివ పురాణంలోని మార్కండేయ చరిత్ర పఠిస్తే అపమృత్యువు బాధ తొలగుతుందని ప్రజల నమ్మకం. ఈ గాథను చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో కేబేరా పిక్చర్స్ బ్యానర్‌పై 1938లో ఘంటసాల బలరామయ్య, వెంకటరెడ్డిలు చిత్రంగా రూపొందించారు. జియన్ స్వామి మార్కండేయునిగా, వేమూరి గగ్గయ్య యమునిగా నటించారు.
జెమినీ సంస్థలో కొంతకాలం కెమెరా విభాగంలో పనిచేసిన బిఎస్ రంగా (బిందినగనవీవే శ్రీనివాస అయ్యంగార్ రంగా) ‘్భక్తతులసీదాస్’ తమిళ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. కొంతకాలం ఛాయాగ్రహకునిగా పనిచేసి, తరువాత విక్రమ్ స్టూడియోస్ నిర్మించి తెలుగులో మాగోపికి (1954) స్వీయ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో 20 చిత్రాల వరకూ సమర్పించారు. హిందీలో ‘ప్యార్‌కియాతో డరన్ క్యా’ వీరిచే సమర్పించబడిందే. 1956లో విక్రమ్ ప్రొడక్షన్స్‌పై రూపొందించిన చిత్రమే -్భక్తమార్కండేయ. ఈ చిత్రం 60 యేళ్లు పూర్తి చేసుకుంది.
***
మృకండ మహర్షి (నాగయ్య), మరుద్వతి (పుష్పవల్లి) దంపతులు. సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేస్తారు. ఈశ్వరుడు (కాంతారావు) ప్రత్యక్షమై దుర్మార్గుడైన దీర్ఘాయుష్మంతుడినైనా లేక సన్మార్గుడైన అల్పాయుష్కుడునైనా పుత్రునిగా కోరుకొమ్మంటాడు. మృకండుని ప్రార్థన అనుసరించి పదహారేళ్లు మాత్రమే జీవించే కుమారుని అనుగ్రహిస్తాడు. ఈ రహస్యం మృకండుడు తన భార్యకు తెలియనివ్వడు. మార్కండేయునిగా నామకరణం చేయబడిన ఆ బాలుడు చిన్ననాటి నుంచి ఈశ్వరారాధనలో కాలం గడుపుతుంటాడు. కుమారునికి ఉపనయన సమయంలో మృకండ మహర్షి అతనికి బ్రహ్మోపదేశం చేస్తాడు. ఆ సమయాన నారద మునీంద్రుడు (రఘురామయ్య), ఇతర మునులు మార్కండేయుని చిరంజీవిగా ఆశీర్వదిస్తారు. అది విని కలతచెందిన తండ్రి బాధను మార్కండేయుడు అర్థం చేసుకుంటాడు. పరమశివుని మెప్పించి తండ్రికి పుత్రశోకం లేకుండా వరం పొందుతానని తపస్సుకు బయలుదేరుతాడు. మార్కండేయుని తపస్సుకు భంగం కలిగించటానికి మహేంద్రుడు అప్సరసలను పంపటం, అతని భక్తి పరీక్షించిన ఈశ్వరుడు ముదుసలి రూపంలో రావటం జరుగుతుంది. నారదుని సూచనతో ఈశ్వరుని ప్రసిద్ధ లింగాలను దర్శించి, కాళహస్తియందు గర్భగుడిలో నిష్టగా శివుని పూజిస్తుంటాడు మార్కండేయుడు. అదే సమయంలో యమధర్మరాజు వచ్చి అతనిపై పాశం ప్రయోగిస్తాడు. శివలింగం నుండి ఈశ్వరుడు ఉద్భవించి యముని దండించి మార్కండేయుని రక్షిస్తాడు. దేవతల వేడికోలుతో యమధర్మరాజును బ్రతికించి, మార్కండేయుని చిరంజీవిగా వర్ధిల్లమని వరమివ్వటంతో చిత్రం ముగుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ మూడు భాషల్లో చిత్రం రూపొందింది. చిత్రంలో యమునిగా కన్నడ నటుడు ఆర్ నాగేంద్రరావు నటించారు. మార్కండేయునిగా మూడు భాషల్లో మాస్టర్ ప్రభాకర్, మాస్టర్ బాబ్జీ (తెలుగు), మాస్టర్ ఆనంద్‌లు నటించారు. పార్వతిదేవిగా పద్మిని ప్రియదర్శిని, అప్సరస మధుమాలిగా సూర్యకళ, బహు సంతానవంతులైన దంపతులు.. భర్త భల్లూకభట్టుగా సిఎస్‌ఆర్, భార్య సంతాన ప్రియగా ఆర్ బాలసరస్వతి, వైద్యుడిగా వంగర నటించారు.
దర్శకుడు బిఎస్ రంగా సన్నివేశాలను ఆకట్టుకునే రీతిలో చిత్రీకరించారు. తొలుత నారదుడు, ఈశ్వర దంపతుల వద్దకు వచ్చి వినాయకుడు, కుమారస్వాముల్లో ఎవరు గొప్ప వివాదం దర్శించటం, తరువాత మృకండ మహర్షికి సంతానం కలిగించమని ఈశ్వరుని కోరటం.. ఎరుకలసాని వేషంలో వచ్చిన పార్వతి, ముని దంపతులకు సంతాన ప్రాప్తి ఉందని చెప్పటం.. అంతకుముందు దేవసభ ప్రవేశ నిరాకరణ.. మునుల భోజన తిరస్కారం, సాటి స్ర్తిలలో గొడ్రాలని మరుద్వతికి అవమానం, మార్కండేయుడు తపస్సు చేస్తుండగా భంగం కలిగించవద్దని నారదుడు మరుద్వతికి బోధన, శివారాధన చేస్తున్న మార్కండేయుని ఈశ్వరుడు మారువేషంలో పరీక్షించటం, అప్సరసలు తపోభంగం చేయబోయి భంగపడడం, శివుని జంబుకేశ్వర క్షేత్రంలో జల, అగ్ని, వాయు రూపాల్లోని క్షేత్రాలను విపులంగా పాటలో వర్ణిస్తూ వాటిని వివరంగా చూపటం, శివలింగం నుండి ఈశ్వరుడు త్రిశూలంతో యముని నివారించటం, తిరిగి దేవతల వేడుకోలు.. ఇలా సన్నివేశాలను ఎంతో అర్ధవంతంగా రూపొందించి చిత్రీకరించారు.
సముద్రాల వారి రచన, పాటలు భావయుక్తంగా భక్తిరస ప్రధానంగా సాగాయి. నాగయ్య, పుష్పవల్లిలపై తొలి భక్తి గీతం -ఓం నమఃశివాయతో ప్రారంభించి -జయజయ శ్రీమన్మహాదేవా సేవా సపర్యాది సంజాత (నాగయ్య, లీల, బృందం), రఘురామయ్య గానం చేసిన గీతం -శివనామ భవతరణా, శివ తమచరణా, మరో గీతం -దేవాది దేవా శ్రీకర శుభకర, పంచభూత క్షేత్రాలను వర్ణించే మరో పద్యం -పావనమ్మగా తిరువారూరుపురమునందు రంగారు సైకత లింగమగుచు, మార్కండేయునిపై -సకల చరాచర జీవుల హృదయాల వెలసి మెంగేదేవా (శూల మంగళం రాజ్యలక్ష్మి), మరో గీతం ‘జయజయ సర్వేశ నిను మదిని (సత్యవతి), నాగయ్య మార్కండేయులపై గీతం -వాగేశ ముఖశరణ, యోశనుతచరణా (గానం- నాగయ్య, సత్యవతి), సాధువులపై భక్తిగీతం -అంతా శివమయమన్నా (పిఠాపురం, బృందం), తల్లి ప్రేమ నేపథ్యంలో వచ్చే గీతం -ప్రేమాకృతివో అమ్మా (పిబి శ్రీనివాస్), పుష్పవల్లి, ముతె్తైదువులపై గీతం -ఊగూ, ఊగూ ఉయ్యాల ఊగు హాయిగా జంపాల (లీల బృందం) భక్తిరస ప్రధానంగా సాగుతాయి. జానపదులుగా రమణారెడ్డి లక్ష్మీరాజ్యం బృందంపై చిత్రీకరించిన తమాషా యుగళ గీతం -కనె్నలేడి కళ్ళదానా మల్లీ మొగ్గాపళ్లాదానా (పిఠాపురం, జమునారాణి), సిఎస్‌ఆర్, బాలసరస్వతిలపై గీతం -ఔనంటారా, కాదంటారా ఇంటికి అందం ఇల్లాలే (పిఠాపురం, జమునారాణి) గీతాలు తరువాతి సన్నివేశాలకు బలం చేకూర్చేవిగా ఉంటాయి. ఎంఎస్ విశ్వనాథన్, రామ్మూర్తి సంగీతంలో, సముద్రాల సాహిత్య గుబాళింపుతో గీతాలన్నీ పరిమళించాయి.
పలు చిత్రాలలో నాయికగా వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకున్న పుష్పవల్లి, కొన్ని రోజుల విరామనంతరం తిరిగి ఈ చిత్రంలో మళ్లీ నటించటం ప్రారంభించారు. ఆమె కుమారుడు బాబ్జీ, కొడుకుగా మార్కండేయునిగా నటించటం విశేషం. 1938, 1956ల్లో రూపొందించిన ‘్భక్తిమార్కండేయ’ను తరువాత 1982లో భానుమతీ రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, రచన సంగీత సారథ్యం చేపట్టారు. మార్కండేయ చరిత్రకు ధృవుని వృత్తాంతము కలిపి ‘్భక్త్ధృవ మార్కండేయ’గా రూపొందించారు. (శివకేశవుల వృత్తింతాలు కలపటం, శివ కేశవ భేదం లేదని నిరూపించటం విశేషం) 1956 భక్త మార్కండేయ విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి