Others

సమాజం బాగుండాలి (డైరెక్టర్స్ చాయిస్..) -ఎస్.ఎం.సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో సినిమాలు చూసి యువత నిర్వీర్యమవుతున్నారు. సమాజానికి అవసరమైన పౌరులుగా ఎదగడంలేదు. ఓ రకంగా వారి భవిష్యత్తును సినిమాలే నాశనం చేస్తున్నాయి అని ప్రజాభిప్రాయం వినబడుతున్న నేపథ్యంలో సినిమాలవల్ల సమాజం బాగుపడుతుందని ప్రేక్షకులు అనుకునే స్థాయికి నేటి సినిమా రావాలని ఆశిస్తున్నాడు దర్శకుడు ఎస్.ఎం.సూర్య. సినిమాపై వున్న చెడు అభిప్రాయం మారాలంటే మంచి సినిమాలను అందివ్వాలని చెబుతున్న ఆయనతో
ఈవారం చిట్ చాట్...

మీ నేపథ్యం?
-మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు. డిగ్రీ చదివా. నేరాలు- ఘోరాలు, క్రైం రిపోర్టింగ్‌తో ప్రారంభమైన నా జర్నీ ‘మొహబ్బత్ మే’ చిత్రంతో దర్శకుడిని అయ్యాను.
అనుభవం?
-అన్నపూర్ణ స్టూడియోలో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రానికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాను. ‘బొబ్బిలి బుల్లోడు’, ‘బొబ్బిలిదొర’, ‘యూత్’ చిత్రాలకు పనిచేశా. నా గురువులు సాగర్, బోయపాటి కామేశ్వరరావు, జితేంద్ర.
ఇష్టమైన జోనర్?
-ప్రేమకథా చిత్రాలతోపాటుగా దేశభక్తిని ప్రేరేపించే కథలు చాలా ఇష్టం.
తొలి అవకాశం?
-మొహబ్బత్ మే నిర్మాత రవిశంకర్ ఇచ్చారు.
సమస్యలు?
-కొత్త దర్శకులు స్వేచ్ఛ ఇస్తే మంచి ప్రొడక్ట్ వస్తుంది. దర్శకుడి విజన్‌తో సినిమాను చిత్రీకరించాలని కోరుకుంటాను. తదుపరి చిత్రాలు?
-ఐదారు కథలు సిద్ధంగా వున్నాయి. సాయిధరమ్‌తేజ్, విక్రమ్, పవన్‌కళ్యాణ్, నితిన్, శర్వానంద్‌లకు నేను రాసిన కథలు నప్పుతాయి.
ఇప్పటి సినిమాలు?
-ప్రజలకు ఉపయోగపడే సినిమాలు రావడంలేదు. ఇప్పుడంతా చెత్త సినిమాల ట్రెండ్ నడుస్తోంది. యువతకు మార్గదర్శకంగా ఉంటూ. తల్లిదండ్రులను గౌరవించే సమాజాన్ని నిర్మించే సినిమాలు రావాలి.
దర్శకుడంటే?
-తండ్రి స్థానం అతనిది.

-శేఖర్