Others

అభిమాన ధనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ బ్యానర్‌పై పద్మనాభం నిర్మించిన ప్రథమ చిత్రం దేవత, 24 జూలై 1965 విడుదలైంది. చిత్రంలో సినిమా తారలను అభిమానించే ఒక వీరాభిమాని తన అభిమాన తారల ఇళ్ళకు వెళ్ళి కలసి ముచ్చటించే సన్నివేశం ఆ చిత్రంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవటమే కాకుండా, అభిమానులలో స్నేహభావం కూడా ఏర్పడి కళారంగ అభివృద్ధికి తోడ్పడింది. స్నేహం అంటే ముందు గుర్తుకు వచ్చేది పద్మనాభం. వల్లం నరసింహారావు, పద్మనాభం కలిసి రేఖ అండ్ మురళీ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి శాంతినివాసం, కాళహస్తి మహాత్మ్యంలాంటి నాటకాలతోపాటు పలు నాటకాలను ప్రదర్శిస్తూ ఆంధ్ర దేశంలో పర్యటించారు. నటుడిగా పద్మనాభం స్థాయి పెరిగి నిర్మాతగా మారి అదే సంస్థ పేరిట చిత్ర నిర్మాణం గావించి దేవతతో పాటు శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, పొట్టిప్లీడరు లాంటి చిత్రాలను హేమాంభరదరరావు దర్శకత్వంలో నిర్మించి విజయం సాధించాడు. తర్వాత అదే బ్యానర్ ద్వారా దర్శకుడిగా మారాడు. తమ స్నేహానికి గుర్తుగా స్థాపించిన బ్యానర్ విషయానికి వస్తే వల్లం నరసింహారావు కుమార్తె రేఖ. పద్మనాభం కుమారుడు మురళి. వీళ్లిద్దరి మైత్రికి గుర్తుగా పిల్లల పేరిట సంస్థను ఏర్పాటు చేసి, పలు చిత్రాలను నిర్మించారు. తర్వాత మురళి చేసిన ఒక అనాలోచిత అగ్రిమెంట్ వలన సంస్థకు భారీస్థాయిలో నష్టాలు వచ్చాయ. ఆ సమయంలో తెనాలికి చెందిన కళాభిమాని ఉప్పు సత్యనారాయణ, హాస్య నటుడు సుదర్శన్, పద్మనాభంకు ఘన సన్మానం ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందిస్తూ, ధైర్యం కలుగచేసినప్పటి అరుదైన చిత్రమిది. సినిమా సన్నివేశం జీవితంలోకి రావడం చిత్రం కదూ.

-పర్చా శరత్‌కుమార్