Others

పూర్ ఇల్లీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూరు పట్టుకు వేలాడుతున్నా చాన్స్‌లు రావడం లేదంటూ తెగ
ఇదైపోతుందట ఇలియానా. తెలుగు స్క్రీన్‌మీద స్టయిలిష్ షేపుల్ని ఆరేసి -మొదటి సినిమా దేవదాసుతోనే ‘వావ్’ అనిపించిన ఇలియానా, ఇప్పుడు వేషాలు కోసం వెయిట్ చేస్తోందంటే విచిత్రమే. నిజానికి -ఆదిలోనే ఆమె అందానికి ఫిదా అయిపోయి అందలమెక్కించడమే కాదు, టాప్‌స్టార్‌ని చేసేసింది
టాలీవుడ్. ఎడాపెడా సినిమాలు చేసేసి బాలీవుడ్‌కు ఎగిరిపోయిన ఇలియానా -అక్కడా ఎదిగిపోవాలని చాలా ఆశలే పెట్టుకున్నా ఫలించలేదు. ముంబయి ఆశలు మూణ్నాళ్ల ముచ్చటే అయిపోవడంతో -చేతిలో ప్రాజెక్టులులేక, దూసుకొస్తున్న కొత్తందాల ధాటిని తట్టుకోలేక సతమతమవుతోందట. ట్రై చేస్తే టాలీవుడ్‌లో చాన్స్‌లు దొరికే
అవకాశమున్నా -తన రేంజ్‌కు బాలీవుడ్ నుంచి దిగేది లేదంటూ భీష్మించుకుని కూర్చుందట. పాపం.. వయసుమీరక ముందే ఇలియానాకు
బాలీవుడ్ బ్రేక్‌నిస్తుందో లేదో చూడాలి.