Others

దోశల మీద పన్ను లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైలో హోటల్స్‌లో కొత్త ‘ట్రంప్ దోశలు’ అమ్మడం మొదలుపెట్టాయి. వాటిమీద మామూ లు టాక్సులు తప్పవు గానీ, కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దోశలమీద ‘‘అది ఎమ్.ఎల్.ఏ దోశ అయినా ఎమ్.పి. దోశ అయినా సరే- దానిమీద టా క్స్ లేదు- వెయ్యరాదు’’ అని ఆర్డర్లు పడ్డాయి.
ఐతే జనాలు తెగ లావెక్కిపోతున్నారనీ, వొళ్లు కొవ్వు తగ్గి సన్నంగా, ఆరోగ్యంగా అవ్వాలీ అంటే- ‘కొవ్వు పన్ను’ ఒకటి- పిజ్జాలమీదా, బర్గర్‌లమీదా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ వంటకాలు అమ్మే ‘్ఫస్ట్ఫుడ్స్’ అన్నింటిమీదా టాక్సు మేకులు కొట్టేస్తున్నారు. ‘పిజ్జాహట్’, ‘మెక్‌డొనాల్డ్’ లాంటి కంపెనీల పదార్థాలమీద గట్టిగానే పన్నులు బిగించారు. దేశంలో చెత్త తిండి తినడం ఎక్కువైంది. అంచాత ‘జంక్’ తిండిమీద భారీగా పన్ను వడ్డించారు ఏలినవారు. కొవ్వు వున్న పదార్థాలమీద 14.5 శాతం పన్నులు వడ్డించి జనాలలో కొవ్వు తగ్గించడం అన్న తరుణోపాయాన్ని మొట్టమొదట డన్మార్క్‌లో మొదలయింది.
2011 అక్టోబర్‌లో డెన్మార్క్ ‘కొవ్వు పన్నులు’ వెయ్యడం మొదలెట్టింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని కేరళ రుూ టాక్సులు వేస్తున్నది. ఆమాటకొస్తే- ఫ్రాన్స్, హంగేరీ, బ్రిటన్ దేశాలలో, ఫిన్లాండ్‌లో కూడా ‘సుగర్ టాక్స్’ వుంది. చక్కెర గల కూల్‌డ్రింలమీద, తిండి పదార్థాలమీద కూడా చక్కెర టాక్సు వుంది.
‘నిజానికి కూల్‌డ్రింకుల వ్యసనం తగ్గించాలనే రుూ చర్య’ అన్నాయి ఆ ప్రభుత్వాలు. కాకపోతే కేరళ రాష్ట్రంలో కూల్‌డ్రింకులమీద టాక్సు అదనంగా లేదు గానీ కొబ్బరినూనెమీద, దానితో చేసిన తినుబండారాలమీద ‘టాక్సు’ గుద్దేస్తున్నారు కొత్తగా.
‘‘ఇది అన్యాయం’’ అని జనం గోలెడితే ‘‘కాదు.. కాదు.. ఈ కొబ్బరి నూనె పన్ను మొత్తాన్ని కొబ్బరి రైతుల కోసమే వినియోగిస్తాం’’ అని సమాధానం చెప్పారు.
‘‘అసలు దేశంలో మనం పీల్చే పొల్యూటెడ్ గాలిమీద తప్ప దేనిమీద పన్ను లేదు? డైరెక్టుగానో, ఇన్‌డైరెక్ట్‌గానో పన్ను లేదా సర్వీస్ టాక్సు గానీ పడని చోటెక్కడ?’’ అనడిగాడో సామాన్యుడు.

-వీరాజీ veeraji.pkm@gmail.com