Others

యువత.. ఇ-సిగరెట్‌కు బానిస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య కాలంలో ఇ-సిగరెట్ గురించి వినే ఉంటారు. ఇ-సిగరెట్లు అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్. ఇది మామూలు సిగరెట్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి ధూమపాన ప్రియులకోసం సృష్టించారు. ఇ-సిగరెట్లు అనేవి ఎలక్ట్రానిక్ సహాయంగా తయారుచేశారు. సిగరెట్ లానే ఉంటాయి. కాని వాటిలో పొగాకు బదులుగా ఒక హీటర్,నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది. నికోటిన్‌తో కూడిన నీటి ఆవిరిని పీలుస్తూ సిగరెట్ వ్యసనపరులు ఎలక్ట్రానిక్ సిగరెట్ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. బ్రిటిష్‌లో వీటి వాడకం ఎక్కువ. సిగరెట్లను వదిలిపెట్టే పేరుతో వీటిని అదే పనిగా వాడడంవల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని వార్తలు వస్తుండడంతో వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ వైద్యాధికారులూ భావిస్తున్నారు. ఈ దేశంలో దాదాపు ఇరవై లక్షల మంది ఎలక్ట్రానిక్ సిగరెట్లను వినియోగిస్తున్నట్లు అంచనా. వారిలో ఆరున్నర లక్షల మంది నిత్యం వాడుతున్నారని సమాచారం. దీంతో ఇకపై వైద్యులు సూచిస్తే తప్ప వీటిని విక్రయించరాదని అక్కడి అధికారులు ఆంక్షలు విధించారు. ఇ-సిగరెట్లు పరికరంతో పొగ తాగడం వలన ఊపిరితిత్తులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని సైంటిస్టులు తేల్చేశారు. ఇ-సిగరెట్ల పరికరాలు పొగ కాకుండా.. ఆవిరి రూపంలో నికోటిన్‌ను విడుదల చేస్తాయి. ఈ సిగరెట్‌లో వాడే పొగాకులో కాల్చని నికోటిన్ ఉండటంవలన ఆరోగ్యానికి హానికరమని సాక్ష్యాలను సేకరించారు.
మన దేశంలో తొలుత పంజాబ్, ఇటీవల మహారాష్ట్ర వీటిపై నిషేధం విధించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇ-సిగరెట్లపై నిషేధం విధించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల సంగతులు...
క్యాన్సర్ కారక ఫార్మాల్డిహైడ్ వంటివి ఇ-సిగరెట్లలోనూ ఉంటాయి. వీటిలోనూ నికోటిన్ ఉంటుంది. దీనివల్ల గుండె జబ్బులు వస్తాయి. ఇ-సిగరెట్‌లోని నికోటిన్ లిక్విడ్‌ను వేగంగా ఖాళీచేస్తే.. శరీరంలో వణుకు పుడుతుంది. కండరాలు పట్టు తప్పుతాయి. కోమాలోకి వెళ్లి, మరణించే ప్రమాదమూ ఉంటుంది. నోటి ద్వారా 30-60 మి.గ్రా. నికోటిన్‌ను తీసుకుంటే చాలు.. పక్షవాతంతో ఊపిరితిత్తులు విఫలమై చనిపోతారు. 10మి.గ్రా. నికోటిన్ కూడా పిల్లల ప్రాణాలు హరిస్తుంది. వీటిని వాడటం అంటే.. ధూమపానాన్ని కొనసాగించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఇ-సిగరెట్స్‌లో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాట్రిడ్జ్‌లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఇ-సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఇ-సిగరెట్‌లో పొగాకు ఉండదు. అయితే ఇ-సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్‌లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం మామూలు సిగరెట్లు, ఇ-సిగరెట్లు... ఈ రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి.
అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశే్లషణల ప్రకారం.. ఇ-సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విష పూరిత రసాయనాలూ ఉన్నాయి. కాట్రిడ్జ్‌లో డీ-ఇథైల్ గ్లెకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నోరకాల కాలుష్యాలు సైతం దీని ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగాకు లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇనె్ఫక్షన్లను (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్‌ను) కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలంపాటు కొనసాగితే అది ఇ-సిగరెట్ పొగ అయినా సరే.. కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండె జబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. తాజాగా గ్రీక్ శాస్తవ్రేత్తలు మరో వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లను పిల్లలు ఇంకా యుక్తవయస్కులు కూడా వినియోగించేస్తున్నారు. పలు ఆన్‌లైన్ సైట్‌లు వీటిని విక్రయించటం విశేషం. ఎలక్ట్రానిక్ సిగరెట్లను చిన్నారులకు మరింత చేరువచేసే క్రమంలో పలు కంపెనీలు ఎలక్ట్రానిక్ సిగరెట్లను చెర్రీ, స్ట్రాబెర్రీ, వెనీలా, కుకీస్ ఇంకా మిల్క్‌షేక్ ఫ్లేవర్లలో అందిస్తున్నాయి.
ఎలక్టానిక్ సిగరెట్లకు సంబంధించిన టీవీ ప్రకటనలు మితిమీరుతున్నప్పటికి ప్రభుత్వ పరంగా చర్యలు శూన్యం. వ్యాపార విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ కంపెనీలు ఏటా అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తున్నాయి. పొగతాగటం నిషేధించిన ప్రాంతాల్లోనూ ఇ-సిగరెట్లను ఊదేస్తున్నారు. చర్యలుమాత్రం శూన్యం. అమెరికాలో 53 శాతం మంది యువత ఈ సిగరెట్లు సాధారణ సిగరెట్లతో పోలిస్తే ఆరోగ్యకరమని భావిస్తున్నారట. ఇ-సిగరెట్లను అధికంగా ఉపయోగించటం కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి.

- సాయి ఆదిత్య వైనతేయ