Others

గుత్త్ధాపత్యం ఉండకపోవచ్చు(డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-రమణ్ లోక్ వర్మ

పరిశ్రమలో గుత్త్ధాపత్యం ఎక్కువ కాలం కొనసాగుతుందని అనుకోలేం. మార్పును త్వరలోనే చూస్తామనిపిస్తుంది -అంటున్నాడు కొత్త దర్శకుడు రమణ్ లోక్ వర్మ. పాటలు, ఫైట్ల హోరు కారణంగా తెలుగు సాహిత్యంలోని అద్భుతమైన కథలు స్క్రీన్ వరకూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రమణ్‌తో ఈ వారం చిట్‌చాట్.

మీ నేపథ్యం?
మాది విజయవాడ. హైదరాబాద్ జెఎన్‌టియులో ఫైన్ ఆర్ట్స్ చేశాను. చౌడేశ్వరిదేవి పెన్ నేమ్‌తో రచనలు చేసే మా నాన్నవద్దకు సినిమా, సాహిత్యరంగాల పెద్దలు వస్తుండేవారు. వాళ్ల చర్చలు వింటూ ఎదిగిన వాణ్ని.
దర్శకత్వ శాఖకు ఎలా?
వైవిధ్యమైన పరభాషా చిత్రాలు చూసినపుడు -తెలుగులో ఇలాంటివి ఎందుకు రావని మనసు బాధపడేది. తరువాత -నేనే ఎందుకు అలాంటి చిత్రాలు చేయకూడదు? అన్న ఆలోచనతో ఇలా వచ్చా.
ఇష్టమైన జోనర్?
ఆఫ్‌బీట్‌లో సాగే కమర్షియల్ పాయింట్ చిత్రాలంటే ఇష్టం. అంతర్జాతీయ స్థాయిలో వీటిని ఫిల్మ్‌నాయర్ అంటున్నారు. హాలీవుడ్‌లో వచ్చిన సిన్ సిటీ ఇలాంటిదే. సో, రెగ్యులర్ ఫార్మాట్‌ను బ్రేక్ చేసే ఏ జోనరైనా ఇష్టమే.
తొలి అవకాశం?
నా లఘు చిత్రాలు చూసి సినిమా చేద్దామని నిర్మాతలు వచ్చారు. అలా మొదలైన సినిమా వాయిదాపడింది. తరువాత స్నేహితులంతా ‘అనంతం’ ఆలోచన చేశాం. శ్రవణ్‌కుమార్ ప్రోత్సాహం మర్చిపోలేనిది.
పరిశ్రమలో సమస్యలు?
500, వెయ్యి నోట్లు రద్దవుతాయని అనుకుంటున్నా ఊహించలేదు. అది నేడు నిజమైంది. అలానే సినిమా పరిశ్రమలోనూ గుత్త్ధాపత్యం గురించి ఎక్కువగా వినిపిస్తోంది. మార్పులు చూస్తుంటే, ఆ సమస్య తొలగిపోయే రోజు దగ్గర్లోనే ఉందనిపిస్తోంది.
నెక్స్ట్ ప్రాజెక్టులు?
కన్నడలో ఒకటి, హిందీలో ఒక ప్రాజెక్టు ఉన్నాయి. వివరాలు త్వరలో చెబుతా.
దర్శకుడంటే?
సమాజంలోని మంచి చెడులను విశే్లషించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నవాడు. ఒకవిధంగా టీచర్.

-శేఖర్