Others

విదేశాల్లోనూ అక్కినేని.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటసామ్రాట్ అక్కినేని చిత్రాలను ఆదరించిన అభిమానులు దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఉన్నారు. ఎన్నారైలు -అక్కినేని చిత్రాలపై గోష్టిలతోపాటు చిత్రోత్సవాలూ నిర్వహించిన సందర్భాలున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకుంటూ, తెలుగు సినిమా రంగానికి చెందిన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం మనకు కొత్తే అయినా -అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకొన్న తెలుగు కుటుంబాలు కొన్ని సంస్థలుగా ఏర్పడి అక్కినేని ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించటం ఎప్పటినుంచో జరుగుతుంది. నిజానికి అది వారికొక వేడుక. ఇతర హీరోల మాటెలావున్నా -అక్కినేని చిత్రాలు మహిళలను అమితంగా ఆకర్షించాయని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. మహిళలే ప్రధాన నిర్వాహకులుగా కాలిఫోర్నియా, న్యూజెర్సీ, డల్హాస్, వాషింగ్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో అక్కినేనిపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని పెద్ద సంస్థలు అక్కినేనితోపాటు ఆ చిత్రాల్లో నటించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులనూ ఆహ్వానించగలిగారు. అంతకంటే గొప్ప కళాభిమానం ఏముంటుంది?
అక్కినేని చిత్రాలు సాధించిన విజయాలు, వాటిపై సీనియర్ జర్మలిస్టులు రాసిన రివ్యూలు, చిత్రాలు సాధించిన అవార్డులు, ప్రముఖుల వ్యాసాలు సేకరించి ప్రత్యేక సంచికలు విడుదల చేయటాన్నీ వేడుకగా జరుపుకునేవారు. అమెరికాలోని డేట్రాయిట్‌లో నిర్వహించిన అక్కినేని చిత్రోత్సవంలో ప్రత్యేక సంచిక విడుదల చేస్తున్న ఎన్నారై చెరుకూరి రమాదేవి. అక్కినేనినీ చిత్రంలో చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717