Others

బంధంలో బాల్యం బందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులో ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా సాగిపోయే జీవితం బాల్యం. అలాంటి బాల్యం పెళ్లి అనే బందీఖానాలో బందీ అవుతుంది. ప్రతి ఏడు సెకండ్లకు ఓ బాలికా వధువు పెళ్లిపీటలు ఎక్కుతున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఏటా 45 లక్షల మంది బాలికలకు పెళ్లిల్లు జరుగుతున్నట్లు వెల్లడవుతోంది. ముఖ్యంగా మనదేశంలో సగానికి సగం మంది 15వ పుట్టినరోజుకు నోచుకోకుండానే పెళ్లి అనే బందీఖానాలో బందీ అవుతున్నారు. ఆలోచనలు పరిపక్వత దశకు రాకుండానే ఆడపిల్లలను గుండెలపై కుంపటిగా భావిస్తూ వారిని కన్నవారు వదిలించుకుంటున్నారు. ఇటీవల పలు దేశాలలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయగా 20-24ఏళ్ల వయసు మహిళలను సర్వే చేయగా వీరిలో దాదాపు 7.5శాతం మంది మహిళలు తాము 15ఏళ్లకు ముందే వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని వంద అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న దేశాలలో ఈ పెళ్లిల్లు జరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. 1985లో 12శాతం మందికి పెళ్లిల్లు జరగ్గా అది నేటికీ 7.5శాతానికి తగ్గటం ఒకింత ఊరట కలిగించే అంశం. 2030నాటికి బాల్య వివాహలను పూర్తిగా తగ్గించాలని యునిసెఫ్ కృత నిశ్చయంతో ఉంది.

**
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03