AADIVAVRAM - Others

వాతావరణ మార్పు (శాస్ర్తియ ఆవిష్కరణలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1896లో స్వీడన్ శాస్తవ్రేత్త స్పాంటే అరేవియస్ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరిగే కొలదీ భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పాడు. అరేవియస్‌కు ఆ సమయంలో ఆ విషయం స్పష్టంగా తెలియదు. అతను అస్పష్టంగా ప్రతిపాదించిన సిద్ధాంతం ఆ శతాబ్దం మొత్తం శాస్తవ్రేత్తల చర్చనీయాంశమైంది. మానవులు ఉపయోగించే అనేక వస్తువులు, ఉపకరణాల వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతుందని ఆయన సిద్ధాంతీకరించాడు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి రెట్టింపు అయితే ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని చెప్పాడు. ఆ కాలంలో ఏ/సిలు, ఫ్రిజ్‌లు లేవు. అయినప్పటికీ కట్టెపుల్లల పొగ వల్ల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి వెళ్తోంది. ఈ వినూత్నమైన ఆలోచనను ప్రచురించి, శాస్ర్తియంగా నిరూపించిన ప్రాచీన శాస్తవ్రేత్త అరేనియస్.
మనుషులు ఇప్పుడు ఉపయోగిస్తున్న ఉపకరణాల వల్ల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అయి భూమి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయన్న విషయం నిరూపణ అయింది. అరేనియస్ సమయంలో ఆయన సిద్ధాంతాన్ని చాలామంది అంగీకరించలేదు. ఆయన మాత్రం తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు.
ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో 1930లో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చాలామంది అందుకు ప్రకృతే తప్ప మనుషులు కారణమనలేదు. కాగా బ్రిటన్ ఇంజనీర్ జి.ఎస్.క్యాలెండర్ అరేనియస్ సిద్ధాంతాన్ని 1938లో ముందుకు తీసుకెళ్లారు. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ ముందు పొంచి ఉందని గ్రహించి చెప్పాడు. అరేనియస్ ఊహించి చెప్పినది నిజమని తేల్చారు. ఆ నిజం ఇప్పుడు భూమి వేడెక్కడాన్ని మనం కళ్లారా చూసేలా ఉంది. 1960లో అది నిరూపణ అయింది.