Others

ఐశ్వర్యానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్ననాటి నేస్తాలను, గురువులను చూస్తే ఎవరికైనా ఆనందం వెల్లివిరుస్తుంది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటి ఐశ్వర్యా బచ్చన్ కూడా అలాంటి అనుభూతినే పొందింది. ముంబయిలోని నవోదయ ఇండియా డ్యాన్స్ థియోటర్‌లో ఏర్పాటుచేసిన ప్రపంచ స్థా యి నృత్య సమావేశానికి అతిథిగా ఐశ్వర్యారాయ్‌ను ఆహ్వానించారు. ఇదే సమావేశానికి నిర్వాహకులు ఐశ్వరారాయ్ చిన్ననాటి నృత్య గురువు లతాసురేంద్రను సైతం ఆహ్వానించారు. అక్కడ తన గురువును చూసిన ఈ అందాల సుందరి సంభ్రమాశ్చర్యాలకులోనైంది. గురువును వేదికపైకి తీసుకువచ్చింది. అంతేకాదు వయసు పైబడినప్పటికీ గురువు చేసిన నృత్యానికి పులకించిపోయిన ఐశ్వ ర్య అందరూ చూస్తుండగానే వేదికపైనే ఆమెకు పాదాబివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ రోజు నాకు ఎంతో ఆనందగా ఉందని, రెండవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు నేను తన గురువు వద్దే నృత్యాన్ని అభ్యసించానని, ఆరోజు ఆమె వేసిన బాటే తనకు మార్గమైందని, ఇంత పెద్ద వేదికపై తన గురువు ప్రదర్శనను తిలకించే స్థాయి కి వచ్చానంటే ఆమె వేసిన బాటేనని తన గురుభక్తిని చాటుకుంది.