Others

నాకు నచ్చిన పాట--జననీ శివకామినీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జననీ శివకామినీ/ జయశుభకారిణి/ విజయ రూపిణీ.. అంటూ నర్తనశాల చిత్రంలో ద్రౌపది (సావిత్రి) ఆలపించే పాట చాలా ఇష్టం. మహానటుడు ఎన్టీఆర్, యస్వీఆర్, సావిత్రి మొదలగు భారీ తారాగణం నటించి మెప్పించిన నర్తనశాలలో అన్నీ పాటలూ గొప్పవే అయినా -జననీ శివకామిని పాటకు ప్రత్యేకత ఉందనిపిస్తుంది. చిత్రానికి సంగీతం అందించిన సుసర్ల దక్షిణామూర్తి -ఈ బాణీని స్వరపర్చడంతోనే సంగీతంపై ఆయనకున్న పట్టు చూపిస్తే, తన గాత్ర మాధుర్యం ఎంత గొప్పదో పి సుశీల, అలతి పదాలతో గొప్ప భక్త్భివాన్ని అందించి సముద్రాల వారు ఓ అద్భుతానికి ప్రాణం పోశారు.
**
పాండవులు పదమూడేళ్ల అరణ్యవాసం జయప్రదంగా ముగించుకుని ఏడాదిపాటు ‘అజ్ఞాతవాసం’ చేయాల్సి వచ్చిన సందర్భంలో వచ్చే పాట ఇది. ఏడాదిపాటు అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి అనువైన ప్రదేశంగా విరాటరాజు కొలువును ఎంపిక చేసుకున్న పాండవులు -ప్రచ్ఛన్న వేషదారులై అక్కడికి చేరతారు. పాండవులు సరే, మరి మహిళ అయిన ద్రౌపది పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. ఆ క్రమంలో ద్రౌపది సైరంద్రీగా మాలిని అనే మాయపేరుతో సుదేష్ణదేవి కొలువుకు చేరాలని నిర్ణయిస్తారు. ఆ క్రమంలో సుధేష్ణదేవి పూజ కోసం ఆలయానికి వచ్చినపుడు కాత్యాయని అమ్మను కొలుస్తూ ద్రౌపది పాడే పాట ఇది. ద్రౌపది పాత్రలో సావిత్రి నటన అమోఘం. ఒకపక్క సుధేష్టదేవిని మెప్పించడానికి, మరోపక్క ‘అజ్ఞాతవాసం’ నిర్విఘ్నంగా సాగడానికి తోడుండాలని కోరుతూ ద్రౌపది భక్తి వినయంతో పాడే పాటలో సావిత్రి నటన అమోఘం. పాటకు ఆరంభంలోనే ‘అమ్మా’ అన్న దీర్ఘ పిలుపులో సుశీల తన గొంతులో పలికించిన ఆర్ధ్రతను మాటల్లో చెప్పలేం. అమ్మవునీవె అఖిల జగాలకు/ అమ్మలగన్న అమ్మవునీవే/ నీ చరణములే నమ్మితినమ్మ/ శరణము కోరితి అమ్మా భవానీ.. అన్న చరణం గుర్తుకొస్తేనే సుశీల గాత్ర ధర్మం మనసు నుంచి చెవులకు వినిపిస్తుంటుంది. ఇక రెండో చరణంలో -నీదరినున్న తొలగుభయాలు/ నీదయలున్న కలుగు జయాలు/ నిరతముమాకు నీడగనిలిచి/ జయమునీయవె అమ్మా భవానీ.. అంటూ సాగే బాణీలో ఆర్తి కనిపిస్తుంది. పాటను చిత్రీకరించిన విధానం, సంగీత సాహిత్యాలు, పాత్రధారుల నటన -అన్నీ సమపాళ్లలో రంగరించి అందించిన పాట ఇది. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.

-మాలతి కృష్ణ, కల్లూరు