AADIVAVRAM - Others

అమాయకుడు (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ యువకుడు అమాయకుడు. చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అతనికి వున్న ఆస్తి అంతా ఒక పాడుపడిన ఇల్లు. ఏవో చిన్న పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. నవ్వేవాడు. నవ్వించేవాడు. అందరికీ తలలో నాలుకలాగా మెలిగేవాడు.
ఇరవయ్యేళ్లు కూడా లేని ఆ యువకుడికి సాధువులన్నా, సన్యాసులన్నా ఎంతో భక్తి. గౌరవం. వాళ్ల సద్బోధలు వినేవాడు. వీలయినన్ని మంచి పనులు చేసేవాడు. ఎప్పుడూ ఏదీ దాచుకునేవాడు కాదు. ఆ యువకుణ్ణి ఆ ఊరిలోని వ్యాపారస్థుడు ఒకడు సానుభూతిగా చూసేవాడు. ఒకరోజు ఆ వ్యాపారస్థుడు పిలిచి కూచోబెట్టుకుని మాటల్లోకి దించాడు.
‘రోజూ ఏం చేస్తావు?’
‘ఏం చేస్తాను? ఎవరు ఏ పని చెప్పినా చేస్తాను. వాళ్లు ఇచ్చే తృణమో పణమో తీసుకుంటాను. దాంతో సరుకులు కొని వంట చేసుకుంటాను. నాకు తినగా మిగిలింది ఇతరులకు పెడతాను. రాత్రికి నా ఇంట్లో పడుకుంటాను’ అన్నాడు నవ్వుతూ.
‘నీకు నా ఇంట్లో కావలసినంత పని ఉంది. నీకు నెల జీతం ఇస్తాను. చేస్తావా?’ అన్నాడు వ్యాపారస్థుడు. యువకుడు సరేనన్నాడు. పనికి కుదిరాడు.
ఇల్లు శుభ్రం చెయ్యడం దగ్గర్నించీ సరుకులు కొనడం దాకా అన్ని పనులూ ఆనందంగా చేసేవాడు. నెల జీతంలో తనకు అవసరమయింది ఉంచుకుని తక్కింది పేదసాదలకు ఇచ్చేసేవాడు.
ఒకరోజు వ్యాపారస్థుడు ‘నెలనెలా జీతం ఏం చేస్తున్నావ’ని అడిగాడు. యువకుడు ‘తనకు అవసరమయింది ఉంచుకుని తక్కింది ఇతరులకు ఇచ్చేస్తున్నా’నన్నాడు. ‘నువ్వు భవిష్యత్తు కోసం ఏమీ దాచుకోవా?’ అన్నాడు.
‘నాకు భవిష్యత్తంటే ఏమిటో తెలీద’న్నాడు యువకుడు.
‘కొంత దాచుకుని పెళ్లి చేసుకో’
‘పెళ్ళెందుకండీ?’
‘పిల్లలు పుడతారు. వృద్ధాప్యంలో నిన్ను చూసుకుంటారు’
‘అయితే ఆ పెళ్లి వద్దు. మా వీధిలో ఒక ముసలావిడ ఉంది. ఐదుగురు కొడుకులు. కానీ ఒక్కతే ఉంటుంది’
‘అందరూ అట్లా ఉండరు కదా?’
‘ఎవరో ఎప్పుడో చూస్తారని నేను పెళ్లి చేసుకోను’
ఆ సంభాషణ అంతటితో ముగిసింది. వ్యాపారస్థుడు అనారోగ్యం పాలయి మంచమెక్కాడు. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు మునిగి ఉన్నారు. యువకుడొక్కడే ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పేవాడు. దైవం తనకు చివరి దశలో ఇచ్చిన తోడుగా యువకుణ్ణి గురించి వ్యాపారస్థుడు అనుకున్నాడు. వ్యాపారస్థుడికి పెద్ద ఆస్తి అంతస్థులున్నాయి. వాటి గురించే ఆయన దిగులు పడేవాడు.
యువకుడు ‘అయ్యా! మీకు సంపదతో అనుబంధం. అందువల్ల దుఃఖం మీతో వస్తుంది. నేను ఒంటరిని. దేనిపట్లా వ్యామోహం లేనివాణ్ణి. కాబట్టి ఆనందమొక్కటే నాతో వస్తుంది. ఇది గర్వం కొద్దీ చెప్పడం లేదు. ఈ లోకంలోనివేవీ మనవి కావన్న స్పృహ నాకు ఉంది. అందువల్ల నేను ఏది పోయినా బాధపడను. ఆ కారణంగానే నన్ను జనాలు ‘అమాయకుడంటారు’ అన్నాడు.
యువకుడి మాటలకు వ్యాపారస్థుడి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి.
సంతోషంతో నవ్వుతూ యువకుడి చేయి పట్టుకుని వ్యాపారస్థుడు కన్నుమూశాడు. ష

- సౌభాగ్య, 9848157909