Others

రీల్ హీరోయిన్: రియల్ హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2016 ఏడాది అంతా కూడా ఇండియన్ టెస్ట్ క్యాప్టెన్ విరాట్ కోహ్లీకి నల్లేరు మీద బండినే అయింది. టెస్ట్‌ల్లో ఒన్‌డే ఇంటర్నేషనల్స్; టి-20 మ్యాచ్‌లు- రుూ మూడింటిలో కూడా విడివిడిగా, కలివిడిగా అత్యధిక సంఖ్యలో పరుగులు చేశాడు. యాభై కన్నా ఎక్కువ, సగటున లాక్కున్నాడు.
మొత్తంమీద నలభై రికార్డులు బద్దలు కొట్టిన రుూ మూడు డబుల్ సెంచురీల హీరోగా- టీము కోసం- తన గాళ్‌ఫ్రెండ్‌ను దూరంగా పెట్టుకుని- యిక ఉండబట్టలేక అనుష్కాశర్మను పట్టుకుని డెహ్రాడూన్ జాలీగ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిపోయాడు. మెర్రీ క్రిస్‌మస్, హ్యాపీ న్యూఇయర్ అక్కడ గడుపుతారుట- రుూ సరికొత్త పాత ప్రేమజంట! ‘సెలిబ్రిటీస్’ కనుక రుూ ప్రణయ విహారయాత్రని జార్ఖండ్ వాసులంతా హర్షిస్తూ స్వాగతించారు!
అంతేనా? ముఖ్యమంత్రి హరీష్ రావత్ గారు కూడా రుూ ప్రేమ పక్షులకి స్వాగతం పలుకుతూ ‘ట్వీట్’ చేశాడు. ఐతే, ఏ మాటకామాటే చెప్పుకోవాలి. హరీష్ రావత్‌గారు రుూ ఇద్దరికీ ‘్ఫ్యన్’ అయిన కారణాన కదా- విరాట్‌ని జార్ఖండ్ ‘రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్’గా నియమించుకుంది. ఆ హోదాలో కూడా, యిదే అతని మొట్టమొదటి రాక. మళ్లీ కనుమ పండుగదాకా క్రికెట్‌కి గుడ్‌బై. కాల్‌షీట్స్ తీసుకుంటుందో లేదో ఆమె సంగతి తెలియదుగానీ, ఇంగ్లండ్‌తో- ఒన్‌డే సిరీస్‌కి విరాట్- ‘నెట్స్’ దగ్గరికి, రుూలోగానే రావాలి మరి. అందాకా ప్రేమ ‘వల’లో వుండొచ్చును.
ఆమెను, ‘‘పెళ్లికి ప్లాను ఏమయినా వుందా?’’ అని అడిగితే, అమ్మడు నవ్వుతూ - ‘‘2014 నుంచీ మేం యిలాగే కలిసి తిరుగుతున్నాం- మీరిలా అడుగుతూనే వున్నారు. మాకు లేని తొందర మీకెందుకు?’’ అంది.
ఔను, ఎందుకూ?

‘ఖైదీ’లే వండి, వడ్డించే రెస్టారెంట్!
వేల్స్ రాజధాని కార్డ్ఫి నగరంలోని సెంట్రల్ జైలులోపల ‘స్వర్గ్ధామం’ అనిపించే ‘క్లింక్’ రెస్టారెంట్‌లోకి బయటి పెద్దమనుషులు కూడా వెళ్లి హాయిగా విందారగించి తృప్తిగా తిరిగి బయటికి రావచ్చును. ఆ టింగ్ (అంటే ‘క్లింక్’ అన్న శబ్దం) ఫలహార శాలలో వంటవాళ్లు, సర్వర్లు, క్లీనర్లు అంతా ఖైదీలే వుంటారు. కరడుగట్టిన ఖైదీలు సుదీర్ఘకాల శిక్షలనుభవిస్తూ చివరి అంకం శిక్షాకాలంలోకి వస్తారే- అటువంటి, ముప్ఫై మంది ‘సంస్కారవంతులుగా మారిపోయిన’ నేరస్తులకి, వారానికి 14 పౌండ్ల వేతనంతో- రుూ అతి విచిత్రమయిన రెస్టారెంట్‌లో పనిచేసే అవకాశం యిస్తారు. ‘‘తినడానికి వచ్చే అతిథులు’’ మాత్రం గేటు వెలుపల తనిఖీ చేయించుకుని మరీ లోపలికొస్తారు. మిగతా అంతా ‘టింగ్’ (లోహ పాత్రని గరిటతో కొడితే వచ్చే శబ్దం) హోటల్లోకి జైలులోపలి నుంచే రావాలి. వంటవాళ్లు పనివాళ్లు అంతా షిఫ్ట్‌కాంగానే తిరిగి జైలు గదుల్లోకే వెళ్లిపోవాలి. తిన్నవాళ్లు ‘సెక్యూరిటీ పాస్’ చూపెడుతూ బయటికి పోవాలి. స్టార్ హోటల్స్‌ని మరిపించే రుూ ‘టింగ్’ లేదా ‘క్లింక్’లో ఒక్కటే లోటు. ‘మందు’ సప్లయ్ చెయ్యరు. విందువరకే పరిమితం. 90 మంది అతిథులకు భోజన సుఖం యివ్వగల రుూ రెస్టారెంట్‌వల్ల - సదరు ఖైదీలలో పూర్తి పరివర్తన తేవటం అన్నది సాధ్యమవుతున్నది అంటున్నారు ఆశావాదులు!
వారు ‘నేరకళంకం’ నుంచి బయటపడతారని అధికారుల నమ్మకం. ‘టింగురంగా’లకిది స్వర్గతుల్య భోజనశాలయే! అంతేనా? సినిమా స్క్రిప్టు కూడా రాసుకోవచ్చునేమో?! దీనిమీద.

ఆ ‘వాచీ’ గాలి భోంజేస్తుంది!
‘కీ’ యివ్వాలి - లేదా బ్యాటరీ వెయ్యాలి, చేతి గడియారం అయినా, బల్లవాచీ అయినా, గోడ గడియారం అయినా నడవాలీ అంటే (ముళ్లు తిరగాలి) కానీ, ‘జెగేర్ లెకీవెట్రీ’ అనే స్విస్ శాస్తవ్రేత్త ఓ గాలి గడియారం తయారుచేశాడు. ఇది కేవలం గాలి భోంచేస్తుంది. కరెక్ట్ టైమ్ చూపెడుతుంది. నాలుగువేల అనగా అక్షరాలా- నాలుగు వేల సంవత్సరాలు పనిచేస్తుందిట! గాలిలో మారే ఉష్ణోగ్రత, వాతావరణ ఒత్తిడి చాలు దీనికి. బయట ఓ డిగ్రీ పెరిగితే రుూ వాచీకి 48 గంటల శక్తి తయారవుతుందిట. పైగా దీని పొట్టలో వున్న 210 చిన్ని చిన్ని యంత్రాలు, మనకి దాని గాజు గోడలలోనుంచి కనబడతాయి. దాని ఖరీదు కూడా ఎంతో లేదు. 19 లక్షల రూపాయలు మాత్రమే!...........
భలే క్రిస్‌మస్ కానుక!
శాంటాక్లాస్ అమెరికాలోని మెంఫిస్ నగరంలో- ఒక బ్యాంకుకి హడావుడిగా వచ్చాడు. అందరికీ చాక్లెట్లు అందిస్తూ- క్యాషియర్ కౌంటర్ దగ్గరికి వచ్చి- చాకెట్లతో పాటు ఓ చిన్న చీటీ కూడా ......... అందించాడు. అంతే! మరి కాస్సేపటికి కరెన్సీ కట్టల మూట ఒకటి చేత ధరించి ‘‘మెర్రీ క్రిస్‌మస్!’’ అంటూ ఉడాయించాడు. సి.సి. కెమెరాలో రుూ దృశ్యాన్ని మళ్లీ మళ్లీ చూసి మురిసిపోవడం తప్ప మరింకేం చెయ్యగలరు? గాడ్ రుూజ్ గ్రేట్! ఇదిలా వుండగా పెరూలో ఒక ‘మందు షాపు’లో శాంటాక్లాస్ వచ్చి షాపు యజమానినే బురిడీ కొట్టించాడు. శాంటాక్లాస్ వెనుకనే మరికొంతమంది ఆఫీసర్లు, షాప్ మీద ‘రైడ్’చేసి క్రిస్‌మస్ కోసం దాచిన నల్లమందు వగైరా మాదక ద్రవ్యాలను రశీదు యిచ్చి మరీ పట్టుకుపోయారు క్రిస్‌మస్ కాస్తా కటకటాల వెనక్కి పోయింది. మళ్లీ గాడ్ ఈజ్ గ్రేట్!!

సకల సదుపాయాల అఖిలేష్ బస్సు!
రకరకాల ఎన్నికల ప్రచార శకటాల నిర్మాణంలో ఆద్యులు ఎమ్.జి.ఆర్, ఎన్.టి.ఆర్‌లేనంటారు. కానీ, ఎన్నికల నుంచి ఎన్నికలకి రుూప్రచార రధాల జోరు- ‘మాజోరు’గా మారిపోతోంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశం మొత్తంమీద అతి కీలకమయినవి. గ్రాండ్ అలయన్స్ నుంచి ‘వాకౌట్’ చేసి యు.పి. సైకిల్ పార్టీ అంటే యస్.పి. నేతలు యిప్పుడు తిరిగి ఫ్రంట్‌కోసం అర్రులు జాస్తున్నారు.
‘‘అంతా నాన్నగారు (నేతాజీ) చూసుకుంటారు’ అంటున్న యు.పి. చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్- ఎలక్షన్ ప్రాపగాండా కోసం, ఐదు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఒక అతి విశేషమైన- అఖిల సదుపాయాల శకటం ఒకటి తయారుచేయించుకున్నాడు. అందులో విశేషమేమిటీ అంటే- రుూ ఏ.సి. బస్సు టాపుమీదికి వెళ్లడానికి ‘ఎలివేటర్’ కూడా వుంది. డింగ్‌మంటూ దానిసాయంతో, అతగాడు అక్కడ ప్రత్యక్షం అయి, వోటర్‌లని సంతోషపెట్టే కమ్మని కబుర్లు చెప్పొచ్చును.
ఇది పూర్తిగా బుల్లెట్ ఫ్రూఫ్ శకటం! అయితే బస్సంతా పారదర్శకం. అంతా అద్దాల గోడయే వున్నది. అంతేనా? అందులోనే వంటగది, కచేరీ గది, డ్రాయింగ్ రూమ్ కూడా వున్నాయి. ఈ మెర్సిడెజ్ బస్సుమీద బుల్లెట్ ఫ్రూప్ మందసంలోనుంచి ముఖ్యమంత్రి అఖిలేష్ నిశ్చితంగా లెక్చర్లు దంచవచ్చును.
2012లో అధికారంలోకి వచ్చిన రుూ యువకుడు 2017లో తిరిగి రాగలడా? అన్నది చెప్పడం కష్టమేనంటున్నారు. కాకపోతే పది చక్రాల మీద దొర్లుకుంటూ పోయే రుూ సైకిల్ పార్టీవారి ‘వికాస్ రధ్’ మొదటి ట్రిప్పులోనే మొరాయించింది! ముఖ్యమంత్రి యస్.యు.వి శకటంలోకి మారిపోవాల్సి వచ్చింది! విధి బలీయం కదా?

veeraji.pkm@gmail.com