Others

కెరీర్ పరుగులో క్యారెక్టర్ ఆంటీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నటితరం హీరోయిన్లు రీఎంట్రీతో నిన్నటి సినిమాల్లో కనిపించారు. నిన్నటితరం హీరోయిన్లూ రీఎంట్రీలతో నేటి సినిమాల్లో మెరుస్తున్నారు. కాకపోతే -చిన్న చేంజ్. -ఒకప్పటి హీరోయిన్లు ప్రభ తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్టులయ్యారు. నిన్నటితరం హీరోయిన్లు ప్రభ పెంచుకుని క్యారెక్టర్ ఆంటీలవుతున్నారు. ప్రస్తుత తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత కలిగిన పాత్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ, క్యారెక్టర్ ఆంటీలకు మాత్రం కథలో ప్రాధాన్యత కలిగిన పాత్రలే దొరుకుతున్నాయి. కథే వాళ్లచుట్టూ తిరుగుతున్న పాత్రలు లభిస్తున్నాయి. మరీ కాదనుకుంటే -క్యారెక్టర్ ఆంటీల కోసం బలమైన పాత్రలను రచయితలు, దర్శకులే కష్టపడి మరీ సృష్టిస్తున్నారు. ఇదీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న లేటెస్ట్ ట్రెండ్.

కొరటాల ‘మిర్చి’, త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రాల్లో సీనియర్ హీరోయిన్ నదియాకు దొరికిన క్యారెక్టర్లతో ఆ తరహా పాత్రలకు కొత్త క్రేజ్ వచ్చిపడింది. ఒక్కముక్కలో చెప్పాలంటే -ఆ రెండు చిత్రాలే క్యారెక్టర్ ఆర్టిస్టును ‘క్యారెక్టర్ ఆంటీ’ లెవెల్‌కు చేర్చేశాయి. హీరోయిన్ల గ్లామర్ ఇమేజ్‌కు ఏమాత్రం తీసుపోనట్టుగా క్యారెక్టర్ ఆర్టిస్టుల -‘్ఫట్‌నెస్ మంత్ర’, ‘ఫెయిర్‌నెస్ గ్లామర్’తో.. ఆ పాత్రలు అంత అందంగా ఉండాలన్న అనధికార రూల్ పాసైపోయింది. ఈ మార్పే -ఎప్పుడో కనుమరుగైపోయి ఎక్కడెక్కడో సెటిలైపోయిన సీనియర్ హీరోయిన్లను వెతికి వెనక్కి తెచ్చే పరిస్థితి కల్పించింది. ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ సైతం భారీ బడ్జెట్‌తో గ్రాండియర్ సినిమాలు తీయడానికి ఏమాత్రం వెనకాడని ధైర్యాన్ని ప్రదర్శిస్తుండటంతో -క్యారెక్టర్ ఆంటీలకు చేతినిండా పాత్రలు లభించే అవకాశాలు వచ్చిపడ్డాయి. రోజుకో రేటు, మొత్తం ప్రాజెక్టుకు మరో రేటు అంటూ -పారితోషికాలు భారీగానే అందుతుండటం, గౌరవప్రదమైన పాత్రలు వస్తుండటంతో మొహమాటాలు లేకుండానే సీనియర్లు మళ్లీ స్క్రీన్‌పై కనిపించేందుకు సై అంటున్నారు.
తమిళంలో -గుడికట్టేంత వెర్రి అభిమానులను సంపాదించుకున్న ఒకనాటి అందాల తార ఖుష్బూ తాజాగా క్రేజీ ప్రాజెక్టులో కనిపించబోతోందన్నది ఇండస్ట్రీ టాక్. హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తరువాత అడపాదడపా పాత్రలతో పరిశ్రమకు అందుబాటులోనే ఉంటూ వచ్చిన ఖుష్బూ -చిన్ని చెరపైనా ప్రత్యేక కార్యక్రమాలు, గేమ్‌షోలతో ఓ వెలుగు వెలిగింది. దాదాపు దశాబ్దం క్రితం మెగాస్టార్ చిరంజీవి సోదరిగా ‘స్టాలిన్’లో కీలకమైన పాత్ర పోషించిన ఖుష్బూ, ఇప్పుడు పవర్‌స్టార్ చిత్రంలో కీలకమైన పాత్ర చేయనుంది. పవన్ -త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో ఖుష్బూకు చాన్స్ దొరకటంతో, అత్తారింటికి దారేదితో నదియాకు వచ్చినంతటి బ్రేక్ రాబోతోందని అంచనా వేస్తున్నారు. మంచి ఫామ్‌లో ఉండగానే సూర్యను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన జ్యోతిక సైతం బలమైన రీఎంట్రీనే ఇచ్చింది. పెళ్లి, పిల్లలతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనా -్భర్త సూర్య ప్రోత్సాహంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలపైనే దృష్టి పెడుతోంది. బాలీవుడ్‌లో ఫామ్‌లో ఉన్నపుడే అభిషేక్‌ను పెళ్లాడి -ఐశర్య సైతం కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలైన తరువాత -తన స్థాయి ప్రాధాన్యత కలిగిన పాత్రలతో మళ్లీ హవా కొనసాగిస్తోంది. ఇప్పుడు -జ్యోతిక అదే స్ట్రాటజీని కొనసాగిస్తోందని అంటున్నారు. స్టార్ హీరో సూర్య ప్రోత్సాహం ఉండటంతో క్రేజీ ప్రాజెక్టులకే జ్యోతిక కాల్షీట్లు ఇస్తోంది. ఫామ్‌లో ఉన్నపుడు తమిళ ఇలయదళపతి విజయ్‌తో రెండు సూపర్‌హిట్లు అందుకుని విరామం ప్రకటించిన జ్యోతిక -మళ్లీ అదే విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 61వ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తూ కెరీర్‌ను మొదలుపెడుతోంది. చిత్రంలో సమంత, కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుండటంతో -జ్యోతిక పాత్ర ఎలాంటిదై ఉంటుందా అన్న ఆసక్తి కనిపిస్తోంది. తెలుగు, తమిళంలో హద్దుల్లేని గ్లామర్ షోతో అట్రాక్షన్ పెంచుకున్న నమిత సైతం సెకెండ్ ఇన్నింగ్స్‌ను మళ్లీ స్టార్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. బొద్దుగుమ్మలను భుజానికెత్తుకునే తమిళుల నుంచి ఆదరాభిమానాలు సంపాదించుకున్న నమిత -కొద్దికాలం క్రితం ‘జగన్మోహిని’గా కనిపించీ క్రేజ్ సంపాదించింది. తెలుగు, తమిళంలో మళ్లీ క్రేజ్ కోసం ఆరాటపడుతోంది. కొత్త దర్శకుడు రాజ్‌కుమార్ నిర్మించనున్న ‘గుంటూరు టాకీస్-2’లో గ్లామర్ షోతో తన సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది. వయసు మీదపడినా -సీనియర్ హీరోల సరసన సీనియర్ హీరోయిన్‌గా రొమాంటిక్ కెమిస్ట్రీని పండిస్తూనే, ఇటు అత్త, అమ్మ పాత్రలతో మెప్పిస్తున్న రమ్యకృష్ణను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. జయసుధ, హేమమాలిని, రేవతిలాంటి సీనియర్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ప్రాధాన్యత కలిగిన పాత్రలతో నాన్‌స్టాప్ కెరీర్‌ను కొనసాగిస్తుంటే, రోహిణి, మధుబాల, రాశి, పవిత్రలోకేష్, ప్రగతిలాంటి ఆరిస్టులు మీడియం రేంజ్ ఆంటీ తరహా నిండైన పాత్రలతో మెప్పిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు, వాటిలోని బంధాలకు ప్రాధాన్యతనిస్తూ పరిశ్రమలో చిత్రాలు తయారవుతోన్న సీజన్ నడుస్తుండటంతో -క్యారెక్టర్ ఆంటీల కెరీర్ హాయిగా సాగిపోతోంది. స్కోప్‌వున్న చిత్రాల్లో క్యారెక్టర్ ఆంటీలుగా అనుభవంతో కూడిన నటన ప్రదర్శిస్తూ, ఆడియన్స్ నుంచి అభిమాన ప్రశంసలు అందుకుంటుండటం హర్షించదగ్గ విషయం.

-రాణీప్రసాద్