Others

నోట్ల రద్దు పెద్ద ఇబ్బందే (డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న సినిమా అన్న తరువాత బడ్జెట్ పరిమితి తప్పదు. ఆ ఇబ్బంది అధిగమించి చక్కని ప్రణాళికతో సినిమాను చేసినా -పెద్ద నోట్ల రద్దుతో చిన్న సినిమాలు ఇబ్బందులు పడ్డాయ అంటున్నాడు దర్శకుడు మల్లిక్‌రామ్. ‘నరుడా డోనరుడా’ చిత్రానికీ అదే ఇబ్బంది అంటున్న మల్లిక్‌రామ్‌తో ఈవారం చిట్‌చాట్

మీ నేపథ్యం?
విశాఖపట్నంలో చదువు. ఏయూలో ఆర్కిటెక్ట్ చేశా. ఉద్యోగరీత్యా హైద్రాబాద్‌కు వచ్చి ఆసక్తితో పరిశ్రమలోకి అడుగుపెట్టాను.
అనుభవం?
దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దగ్గర వర్క్ చేశాను. గోల్కొండ హైస్కూలు సినిమా చేస్తున్నపుడు హీరో సుమంత్‌తో కలిగిన పరిచయం ‘నరుడా డోనరుడా’కు దారితీసింది.
దర్శకుడవ్వాలన్న కోరిక?
వైజాగ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లం. అప్పటికి యూ ట్యూబ్ లేదు. స్నేహితులతో సరదాగా ఫిల్మ్స్ చేసి ఎంజాయ్ చేసేవాళ్లం. ఆ క్రమంలో దర్శకుడు కావాలన్న ఆశ కలిగింది. పరిశ్రమకు వచ్చాక భయంపోయి నమ్మకం పెరిగింది.
నచ్చే జోనర్?
డ్రామా ఇష్టం. కామెడీ అంటే మరీ ఇష్టం. సినిమాలో పాత్రల మధ్య ఏదో సంఘర్షణ ఉండాలి. అలాంటి సంఘర్షణను బలంగా చూపించడం ఇష్టం.
ఎన్నాళ్లీ.. లవ్, హారర్ సీజన్?
లవ్ ఎవర్‌గ్రీన్. హారర్‌కు ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు. అందుకే -వాటికి సీజన్‌తో సంబంధం ఉండదు. రొమాన్స్‌లో అన్ని జోనర్లూ ఇమిడినా హారర్‌ని మిక్స్ చేయలేం.
తొలి అవకాశం?
హీరో సుమంత్‌తోనే. టైటిలూ ఆయనదే.
సమస్యలు?
చిన్న సినిమాకు బడ్జెట్ పరిమితులుంటాయి. చిత్ర నిర్మాణ సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది ఇండస్ట్రీ సమస్య. విడుదల తరువాత పెద్ద నోట్ల రద్దు ఇబ్బంది పెద్దగా ఎదుర్కొన్నాం. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. ఫలితం దక్కలేదు.
తరువాతి ప్రాజెక్టులు?
ప్రాజెక్టులున్నాయి. నిర్మాతలూ ఉన్నారు. కథలు రాసుకుంటున్నా. త్వరలో చెబుతాను.
దర్శకుడంటే?
ట్వెంటీ ఫోర్ క్రాఫ్ట్స్‌ని పర్ఫెక్ట్‌గా డీల్ చేసి.. చెప్పదలచుకున్న విషయాన్ని క్రియేటివ్‌గా చెప్పగలిగేవాడు.

-సరయు