Others

శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలిదశలో అలా..

నట జీవితం నుంచి రాజకీయ రంగంలోకి అడుగిడిన తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టి.. భారతీయ రాజకీయ చరిత్రలో సువర్ణ్ధ్యాయం, సరికొత్త రికార్డు సృష్టించిన వ్యక్తి -ఎన్టీఆర్. ఐదేళ్ల అధికార హోదా తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూనే మళ్లీ నట జీవితంలో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అలా అంగీకరించిన చిత్రమే -మోహన్‌బాబు నిర్మించిన మేజర్‌చంద్రకాంత్. కొంతకాలం విరామం తర్వాత మళ్లీ మాతృ సంస్థలో కాలిడిన ఎన్టీఆర్ -సెట్లో ఉన్నపుడు గతం మాదిరికాకుండా తోటి నటీనటులతో, యూనిట్ సభ్యులతో జాలీగా గడిపేవారు. గాంభీర్యంగా కనిపించే ఎన్టీఆర్ హాయిగా అందరితో కలివిడిగా మాట్లాడుతుండటంతో -ఆయన చుట్టూవుండే వాతావరణంలో పూర్తి మార్పు కనిపించేది. సెట్లోకి వార్తా సేకరణకు వచ్చిన మీడియాకు కడుపునిండా వార్తలందేలా ఎన్టీఆర్ కబుర్లు చెప్పేవారు. నటీనటులను, యూనిట్ సభ్యులను పేరుపేరునా పలుకరిస్తూ సరదాగా గడిపేవారు. సినిమా రంగానికి చెందిన ఇతరులూ ఎన్టీఆర్‌ను కలవటానికి ప్రత్యేకంగా వచ్చేవారు. ఒకసారి దర్శకుడు దాసరి నారాయణరావు, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా సెట్‌కు వచ్చి ఎన్టీఆర్‌ను కలిసి వెళ్లినప్పటి చిత్రమిది.
ఒకప్రక్కన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో నటిస్తూనే, మరోపక్క బాపు దర్శకత్వంలో శ్రీనాథ కవిసార్వభౌమ చిత్రం తయారీకి సన్నాహాలు చేయనారంభించారు ఎన్టీఆర్. దాంతో సినిమా సెట్లోనే ఎక్కువ సమయం గడిపేవారు. శ్రీనాథ కవిసార్వభౌమ చిత్రం కూడా మేజర్ చంద్రకాంత్ విడుదలైన ఏడు నెలల గ్యాప్‌లోనే 1993లో విడుదలైంది. రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ ఉన్నపుడు రజనీకాంత్, దాసరి నారాయణరావులతోపాటు దర్శకుడు రాఘవేంద్రరావు కూడా సరదా ముచ్చట్లలో పాల్గొనేవారు.
మామూలుగా అయితే, షూటింగుల కోసం ఎన్టీఆర్ సెట్‌కు వస్తే, అక్కడంతా కర్ఫ్యూ వాతావరణం ఉండేది. సెట్‌లో తన స్థానంలో ఆశీనులై సీరియస్‌గా తన పాత్రకు సంబంధించిన విషయం చూసుకునేవారు తప్ప, ఇతర అనవసర విషయాల గురించి పిచ్చాపాటి ఉండేది కాదు. ఇతర నటీనటులు కూడా ఇదే క్రమశిక్షణ పాటించేవారు. అలాంటిది సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎన్టీఆర్ తన సహజ వైఖరికి భిన్నంగా సరదాగా కబుర్లుచెపుతూ ఉండటం అందరికీ ఆశ్చర్యంగా గోచరించేది. అలాంటి ముచ్చట్లలో.. తన నట జీవితం, ప్రారంభ దశలోని కొన్ని ముఖ్య అనుభవాలతోపాటు, తాను నటించిన పాత్రల గురించి విశే్లషణాత్మకంగా చెపుతుండేవారు. ‘అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూ సినిమా నిర్మించాలని భావించాను. కాని సాధ్యం కాలేదు. బ్రదర్ కృష్ణ నటించిన సీతారామరాజు పాత్రను చూసి ఆనందించాను. ఆ తర్వాత ఇక సినిమా ఆలోచన విరమించుకొన్నా’ అనేవారు. భవిష్యత్‌లో పడాల రామారావు స్క్రిప్టుతో బాలయ్యతో చిత్రం నిర్మించే ప్రయత్నం చేస్తాను అనేవారు.
సీతారామరాజు పాత్ర వేయాలన్న ఎన్టీఆర్ కోరిక తీరలేదు. రెండో కోరికా తీరకుండానే మహానటుడు నిష్క్రమించటం బాధాకరం. ఈ ఫొటో చూసినపుడు అప్పటి ఎన్టీఆర్ కబుర్లు మనసుకు పదే పదే గుర్తుకురావటం ఖాయం.