ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకత వైపు ఎక్సయజ్ అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని మద్యం అమ్మకాల వివరాలను ఈ నెలాఖరులోగా పూర్తిగా కంప్యూటరీకరిస్తామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మద్యం విక్రయాలకు సంబంధించిన వివిధ సమస్యలు ఈ విధానం వల్ల చాలా వరకూ పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి నెలాఖరు నాటికి అన్ని దుకాణాల్లో మద్యం విక్రయాలు కంప్యూటరీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 4154 దుకాణాలు ఉండగా, వాటిలో 4000 దుకాణాల వరకూ కంప్యూటర్లను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. కానీ 30 నుంచి 40 శాతం దుకాణాల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, కనెక్టివిటీ, తదితర సమస్యలు ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. త్వరలోనే వీటిని అధిగమించి విక్రయాల వివరాలన్నీ కంప్యూటర్‌లో నమోదయ్యేలా చేస్తామని తెలిపారు. ఈ విధానం అమలు వల్ల రాష్ట్రంలో మద్యం విక్రయాల వివరాలు ఎప్పటికప్పడు తెలియడమే కాకుండా, ఎంఆర్‌పికే విక్రయించేందుకు వీలు ఉంటుందన్నారు. కొనుగోలుదారుడికి ఇచ్చే రశీదుపై ధర ఉంటుందని, దీనివల్ల ఎక్కువ ధరకు అమ్మితే ప్రశ్నించే వీలు ఉంటుందని తెలిపారు. ఎంఆర్‌పికి విక్రయించని దుకాణాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే చాలా కేసులు నమోదు చేశామని, ఏడు దుకాణాల లైసెన్సులు రద్దు చేశామని వివరించారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మద్యం దుకాణాల తొలగింపు గురించి ప్రస్తావిస్తూ మున్సిపాలిటీ, నగర పరిధిలో ఈ నిబంధన వర్తించదని తెలిపారు. బార్లకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉన్న కారణంగా నెలా నెలా లైసెన్సు పొడిగిస్తున్నామని తెలిపారు. మద్యం దుకాణాల తెరచి ఉంచే సమయాల ఉల్లంఘనపై కూడా 470 కేసులు నమోదు చేశామని, తమ శాఖలో కూడా గ్రీవెన్సు సెల్ ఉందని తెలిపారు.