రాష్ట్రీయం

పని చేయకపోతే ఇంటికి పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ‘కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అంకిత భావంతో పనిచేయని నాయకులకు ఇక ఆ పదవులు ఊడినట్లే. పార్టీ పటిష్టత కోసం ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్యలు చేపట్టారు. గురువారం నగరానికి వచ్చిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఇతర ముఖ్య నాయకులతో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతపై ప్రధానంగా చర్చ జరిగింది. వివిధ పార్టీ పదవుల్లో ఉంటూ పార్టీ పటిష్టతపై దృష్టి సారించని వారిని తప్పించి, కొత్త వారికి స్థానం కల్పించాలని దిగ్విజయ్ చేసిన సూచనతో ఉత్తమ్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. కొంత మంది నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినందున, ఆ పదవుల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. గత ఏడాదిన్నర కాలంగా పార్టీలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నందున, వాటిని దూరం చేసి పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం నింపేందుకు కసరత్తు మొదలు పెట్టారు.
మార్చిలో మళ్లీ వస్తా..
మార్చిలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ వస్తానని, ఈలోగా టి.పిసిసి కమిటీని, అనుబంధ విభాగాలను చక్కదిద్దాలని దిగ్విజయ్ ఉత్తమ్‌ను ఆదేశించినట్లు సమాచారం. పార్టీలో ఎటువంటి పదవి లేకపోయినా పార్టీ పటిష్టత కోసం అంకితమైన భావంతో పని చేస్తున్న వారిని గుర్తించి, పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన అనే్వషిస్తున్నారు. ఇలాఉండగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్‌సిసి) అధ్యక్ష పదవికి దానం నాగేందర్ చేసిన రాజీనామాను ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆమోదించి, పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి క్యామ మల్లేష్ రాజీనామా చేసినా, ఆయన రాజీనామా ఆమోదించే విషయంలో సంశయిస్తున్నట్లు సమాచారం. అందుకు కారణం కొంత మంది నాయకులు ఆయన రాజీనామాను ఆమోదించరాదని ఉత్తమ్‌పై వత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.