రాష్ట్రీయం

పుష్కరాలకు 825 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: కృష్ణా పుష్కరాల కోసం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 825.16 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపినట్టు సచివాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన తెలిపారు. ఆగస్టులో కృష్ణా పుష్కరాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించినట్టుగానే కృష్ణా పుష్కరాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్లగొండ జిల్లాలో 34 మొత్తం 86 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు అనువైన చోటనే స్నా ఘట్టాలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. సాన్న ఘట్టాలకు 212.99కోట్ల రూపాయలు, ఆర్‌అండ్‌బి రహదారుల నిర్మాణానికి 398.03 కోట్లు, పంచాయితీరాజ్ రహదారుల నిర్మాణానికి 133.83 కోట్ల రూపాయలు, ఆర్‌డబ్ల్యుయస్‌కు 38 కోట్లు, మత్స్య శాఖకు 1.19 కోట్లు, విద్యుత్ శాఖకు 8.60 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. జిల్లా కలెక్టర్లు పూర్తి అంచనాలతో టెండర్లు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అలంపూర్ జోగులాంబ శక్తి పీఠం ప్రాధాన్యతను ప్రచారంలోకి తీసుకు వచ్చేందుకు ఆలంపూర్ జోగులాంబ దేవాలయానికి వెళ్లే రోడ్డును డబుల్ రోడ్డు చేసేందుకు 25 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలిపారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాలయాల మరమ్మత్తుకు 4.54 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. కృష్ణా పుష్కరాలకు మూడు నుండి నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. పుష్కర ఘాట్లకు వెళ్లే ముఖ్యమైన ప్రాంతాలకు వన్‌వే నిబంధన విధించనున్నట్టు, అన్ని ఘాట్ల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ గొంగడి సునీత కూడా విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.