ఆంధ్రప్రదేశ్‌

మంత్రులతో చంద్రబాబు సమాలోచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం కసరత్తు చేస్తుండడంతో ఆ వివరాలపై సిఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై ప్యాకేజీ గురించి చర్చిస్తున్నారు. మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పుల్లారావులతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలకు దీటుగా ప్యాకేజీ ఉంటుందన్న వార్తలు రావడంతో కేంద్రం ప్రకటించబోయే రాయితీలు, నిధుల కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయని చంద్రబాబు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్యాకేజీ సంతృప్తికరంగా లేకపోతే ఏం చేయాలన్న విషయాన్ని కూడా ఆయన మంత్రులతో చర్చిస్తున్నారు. విశాఖకు బదులు విజయవాడలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన కేంద్రానికి తెలియజేసే అవకాశం ఉంది.