ఆంధ్రప్రదేశ్‌

భద్రతపై హామీ ఇస్తేనే ఆడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:టి-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ కోల్‌కతాలో నిర్వహించేందుకు ఐసిసి అనుమతించినప్పటికీ భారత్‌నుంచి తమ జట్టుకు గట్టి భద్రత ఇస్తామన్న హామీ వస్తేనే పాకిస్తాన్ ఆ పోటీలో పాల్గొంటుందని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇంతవరకు తమకు భారత్‌నుంచి అలాంటి హామీ ఏమీ లభించలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈనెల 19న పాక్-్భరత్ జట్ల మధ్య టీ-20 (ప్రపంచకప్) పోటీ జరగాల్సి ఉంది. ఇటీవల పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉగ్రవాదులు దాడి చేశారన్న వార్తల నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లో మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబాలు పాక్‌తో పోటీని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆ పోటీకి భద్రత కల్పించలేమని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. కేంద్రం భద్రత కల్పిస్తామని చెప్పడం, పాక్ ప్రతినిధిబృందం ధర్మశాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం, వేదిక మార్పునకు ఐసిసి అంగీకరించడంతో కోల్‌కతాలో మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమం అయింది.