రాష్ట్రీయం

ప్రత్యేక హోదా సాధన కోసం పట్టుబిగించిన పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వివిధ పార్టీలు తమ ఆందోళనలతో పట్టు బిగిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రులు, నాయకులు, కార్యకర్తలు సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. వెంకటపాలెంలోని ఎన్టీయార్ విగ్రహం వద్ద నుంచి అసెంబ్లీ వరకు సాగిన ఈ సైకిల్ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, అచ్చెయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మక ద్రోహం చేశాయని ఆరోపిస్తూ జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై పాదయాత్రలు జరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్ష నేతలు మధు, రామకృష్ణలతో కలిసి బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు పాదయాత్ర చేశారు. ఈ పాద్రయాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వైకాపా ఎంపీలు లోకసభ నిరవధిక వాయిదా పడటంతో తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించారు. రాజీనామాలపై మరోసారి ఆలోచించుకోవాలని, సభలో ఉండి పోరాటం చేయాలని స్పీకర్ కోరినా.. వైకాపా ఎంపీలు తమ రాజీనామా లేఖలను వెనక్కి తీసుకోలేదు. అలాగే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తమ ఆందోళన ఉధృతం చేశారు.