పర్యాటకం

మాలిన్యాలను దూరంచేసే మందపల్లి శనీశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ నీశ్వరుడు తెలియని వారుండరు. శనీశ్వరుడంటే భయపడని వారు అరుదే. ప్రతివారి గ్రహరాశిలోను శనీశ్వరుని మహిమ ఉండనే ఉంటుంది. శని బాధ తప్పించుకోవాలని ప్రతివారు శనేశ్వర పూజలు చేస్తుంటారు. స్వామి అయ్యప్ప మాల ధరించినవారికి ఈ శనేశ్వరుడు తాను వారిక ఏ ఆపదలు కలిగించనని మాట ఇచ్చాడట.
ఆ శనేశ్వర స్వామిని పూజించిన వారికి ఏ ఆపదలు అపమృత్యుభయాలు కలుగకుండా శనేశ్వరుడే వెంట వుండి కాపాడుతాడు. ఆ స్వామినే ఒకసాని తూర్పుగోదావరి జిల్లాలోని రావుల పాలెనికి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త పేట మండలంలో మందపల్లి అన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడట. ఆ శనేశ్వరుని పూజకు ప్రీతి చెందిన మహాశివుడు నీకేంకావాలో కోరుకోమంటే ఈ నీ శివలింగాన్ని శనేశ్వర లింగంగా పూజించిన వారికి శని బాధలు కలుగకుండా చేయాలని కోరుకున్నాడట. పరమేశ్వరుడు తథాస్సు అన్నాడట. అప్పటి నుంచి ఈ శనేశ్వరుడు ప్రతిష్ఠించి పూజించిన లింగానికి మందపల్లి శనేశ్వర లింగంగా ఖ్యాతి ఏర్పడింది. ఈ స్వామిని పూజించిన వారికి గ్రహపీడలు దూరం అయ్యి ప్రశాంతి ఏర్పడుతుంది.
స్థలపురాణం
ఇక్కడ ఈ స్వామి వెలవడానికి ముందుకాలం లో అశ్వత్థుడు, పిప్పలుడు అనే ఇద్దరు రాక్షసులు తపస్సు చేసుకొనే ఋషులకు ఎంతో ఇబ్బందిని కలిగించేవారు. వీరు బ్రాహ్మణ వేషాలు వేసుకొని వీరి దగ్గరకు వచ్చిన ఇతరులను తినివేసేవారు. వీరివల్ల అటు మానవులు ఋషులు ఇద్దరూ బాధపడుతుండేవారు. వీరంతా కలసి ఈ అసురుల బాధనుంచి విముక్తి చేయమని ఋషులు, మానవులు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు. ఆ బ్రహ్మదేవుడు ఈ రాక్షసులను శనిదేవుడొక్కడే అంతం చేయగలడు అతడిని ప్రార్థిచండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఋషులంతా కలసి శనేశ్వరుని దగ్గరకు వెళ్లారు. వచ్చిన సంగతి చెప్పారు. శనేశ్వరుడు తాను తపస్సు చేసుకొంటున్నానని, ఆ తపస్సు మరికొంత కాలం చేయాలని అపుడు కాని తనకు వారిని సంహరించే శక్తి రాదని చెప్పాడు. ఆ మాటలనువిన్న ఋషి గణమంతా తమ తమ తపశ్శక్తి నంతా శనేశ్వరునికి ధారపోశారు. ఇక అప్పుడు శనేశ్వరుడు విజృంభించాడు. ఆ రాక్షసుల సంహారం చేశాడు. కాని శనేశ్వరునికి బ్రహ్మహత్యాదోషం పట్టుకొంది. ఋషులు, దేవతల సలహాకోసం ఈ మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి తన బ్రహ్మహత్యాదోషాన్ని నివారించుకున్నాడని ఇక్కడి స్థలగాధ చెప్తుంది.
ఈ మందపల్లి ఆలయంలో ప్రధాన ఆలయంలో ఎన్నోగర్భాలయాలు ఉన్నాయి. మందపల్లి శనేశ్వరస్వామిగా మహాదేవుడు కొలువై ఉన్నాడు. ఆయన పక్కనే పార్వతీ దేవి కూడా కొలువై ఉంది. ఈ పార్వతీదేవిని సప్తమాతృకలుప్రతిష్ఠించారని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. మరో గర్భాలయంలో బ్రహ్మదేవుని ప్రతిష్ఠితమైన బ్రహ్మేశ్వరస్వామి లింగం దర్శనం అవుతుంది. ఈ ఆలయానికి ఆనుకొని వున్న ఆలయంలోకర్కోటకుడు ప్రతిష్ఠించిన నాగేశ్వరస్వామి లింగం దర్శనం లభ్యమవుతుంది. ఇక్కడే గౌతమ మహర్షిప్రతిష్ఠించిన వేణుగోపాల స్వామి వారి దర్శనం కూడా కలుగుతుంది. ఒకే ప్రాంగణంలో ఐదు ఆలయాలు, వాటితో పాటు గా అశ్వత్థ , పిప్పల, అగ్త్యస్త తీర్థం లాంటి పదునాల్గువేల నూటెనిమిది తీర్థాలకు ఈ మందపల్లి ప్రసిద్ధమని అంటారు. ఇక్కడ మందపల్లి శనేశ్వరస్వామిని ప్రార్థించినవారికి శనేశ్వరుని వలన కలిగే ఏముప్పు దరిచేరదు.
ఈ మందేశ్వర స్వామికి నిత్యం తైలాభిషేకాలు జరుగుతాయి. నువ్వులనూనెతో అభిషేకించిన వారికి సమస్తపాపాలు దూరం అవుతాయని ఇక్కడి నివాసితులు చెప్తారు. ఈ మందేశ్వర స్వామిని దర్శించి నల్లని వస్తమ్రు, ఇనుపరేకు ఇక్కడికి దగ్గరలో ప్రవహించే నదిలో విడిచి పెట్టడం ద్వారా శని పీడ దూరమవుతుందని అంటారు.
ప్రతి సంవత్సరం మాఘ బహుళ దశిమి నుంచి పాల్గుణ శుక్ల పాడ్యమి వరకు శ్రీ ఉమామందేశ్వర స్వామి, శ్రీ ఉమా బ్రహ్మేశ్వర స్వామికి, శ్రీ ఉమా నాగేశ్వర స్వామికి కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంగరంగవైభోగంగా జరుగుతాయి.
ఈ స్వామిని దర్శించడానికి ఎంతో దూరం నుంచి కూడా భక్తులు వస్తుండడం విశేషంగా చెప్తారు.

రాజమండ్రి నుంచి 28 కిలోమీటర్లు రావులపాలెంనుంచి ఆరు కిలోమీటర్లు, కాకినాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ మందపల్లి క్షేత్రం ఉంది. ఇక్కడికి రావడానికి బస్సు సౌకర్యం ఉంటుంది. రావుల పాలెంలో వసతి సౌకర్యాలు లభ్యమవుతాయ.

- సాయికృష్ణ