పర్యాటకం

అష్టఐశ్వర్య ప్రదాత అష్టలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శే్వతాంబరదేవి నానాలంకార భూషితే
జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే
అంటూ శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మి దేవీ పూజను స్ర్తిలందరూ ఆనందోత్సవాలతో జరుపుకొంటారు. మహాలక్ష్మీ అనుగ్రహం కావాలని పెద్దలు పిన్నలూ లింగవివక్షలేకుండా వేడుకుంటారు.
ఆ వైకుంఠవాసుని ఇల్లాలుగా, మహావిష్ణు వక్షస్థలస్థితగా, సర్వదేవతలచేత కొనియాడబడే మహాలక్ష్మిగా, సముద్రుని కుమార్తెగా, చంద్రుని సహోదరిగా ఉన్న లక్ష్మీదేవి నేడు అష్టలక్ష్మీకళలతో హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్‌కు దగ్గరలోని వాసవీకాలనీలోకి 1996న వచ్చింది.
ఈ ప్రాంతంవారు మహాలక్ష్మీదేవి వచ్చిన ఆనందంతో ఆదిలక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ ‘‘అమ్మా మమ్ము ఏలే ఆదిపరాశక్తివి, జగన్మాతవు, జగస్సాక్షివికూడా నీవే నమ్మా! మాకు ధనం , ధాన్యం, విద్య, వైద్యం, విజయం, ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యాల్నిచ్చి అన్నివేళలా మమ్ము విజయులమై తిరుగాడేటట్టు నిత్యమూ నీ నామస్మరణతో పునీతులం అయ్యేట్టుగా చేయు’’మని వేడుకున్నారు. ఈ తల్లి వీరి కోర్కెలీడేరట్లుగా ఆదిలక్ష్మియైన తనతో పాటుగా సంతాన లక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, వీరలక్ష్ములుగా ఉద్భవించింది. ఆ లక్ష్మీ కళలన్నింటికీ ఈ ప్రాంతంవారు ప్రత్యేక గర్భాలయాలతో పాటు అష్టలక్ష్మీ దేవాలయాన్ని నిర్మించారు.
కంచికామకోటి పీఠాధిపతియైన శ్రీశ్రీ శ్రీ జయేంద్రసరస్వతీ స్వామి వారి అనుగ్రహంతో అష్టలక్ష్మీ దేవాలయాన్ని నిర్మించారు. దీనికి మేరూర్ లోని లోని దేవాలయ నిర్మాణపద్ధతిని, చైన్నై లోని అడయారు దేవాలయనిర్మాణాన్ని కూడా చూచి ఈ వాసవీకాలనీ అష్టలక్ష్మీ ఆలయనిర్మాణ రూపకల్పన చేశారు.
1991నాడు ఆరంభం చేసి 1996న నిర్మాణం పూర్తిఅయిన నాటి నుంచి నేటివరకు అష్టలక్ష్మీ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఎక్కడెక్కడి భక్తులనో ఆకర్షిస్తూ వస్తోంది. శ్రీమన్నారాయణ స్వామికి ఆదిలక్ష్మి అమ్మవార్లకు నిత్యోత్సవాలు పూజాకైంకర్యాలతో పాటుగా ప్రతి శుక్రవారం నాడు విశేషార్చనలు జరుపుతారు. దసరానవరాత్రులు, దీపావళి, ఆండాళ్ల అమ్మవారి పాశురవైభవం జరిగే పండుగ నెల సంక్రాంతి ఇలా ఆషాఢం, శ్రావణ శుక్రవారాలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు డోలోత్సవాలు జరుగుతాయి.అంతేకాక వైశాఖ మాసంలో వార్షికోత్సవాలు, శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు, పుష్యమాసంలో అధ్యయనోత్సవాలు అంటూ ప్రతి మాసంలోను వివిధ ఉత్సవాలను జరుపుతారు. ప్రతిరోజు యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ కుంకుమ పూజలతో ప్రతిక్షణం శోభాయమానంగా దివ్యవెలుగులను విరజిమ్మే ఈ అష్టలక్ష్మీ దేవాలయ దర్శనానికి పలుప్రాంతాలనుంచి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. కేవలం జంట నగరాల్లో ని భక్తులేకాక ఇతర రాష్ట్రాలనుంచి కూడా ప్రైవేటు బస్సులు, వెహికల్స్ తో ప్రత్యేకంగా యాత్రాబృందాలు వచ్చి ఈ అష్టలక్ష్మీతల్లులను దర్శించుకుని వెళ్లడం ఈ దేవాలయ ప్రత్యేకత. ఇక్కడ ఉన్న సంతాన లక్ష్మీ అమ్మవారికి కలశపూజ చేయించుకున్నవారు సంతానవంతులు అవుతారు, విజయలక్ష్మి అమ్మవారికి కలశపూజ చేయించుకున్నవారు విజయులౌతారని ప్రసిద్ధి. ఏ సమస్య ఉన్నవారైనా ఈ అమ్మవార్ల దగ్గరకు వచ్చి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుని ప్రసాదం సేవిస్తే చాలు వారి సమస్యలు దూరవౌతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. వివిధ సందర్భాల్లో ఆదిలక్ష్మీ అమ్మవారికి శ్రీమన్నారాయణ స్వామివారికి జరిపే కల్యాణోత్సవాలు పాల్గును కన్యలకు త్వరగా వివాహాలు జరుగుతాయని కోరిన కోర్కెలు తీరుతాయని ఈ అమ్మవార్ల భక్తుల విశ్వాసం. దేవాలయ ప్రాంగణంలో మొట్టమొదటగా విఘ్నాలను హరించే విఘ్నవినాయకుడు విజయగణపతిగా కొలువై భక్తులను అలరిస్తూ ఉంటాడు. ఆ గణపతి ఆశీస్సులను గైకొని తరువాత అమ్మవార్ల దర్శనానికి వెళ్లాలి. ప్రతి శుక్రవారం అన్నదానం, వార్షికోత్సవాల సమయంలో నిత్యాన్నదానం చేస్తుంటారు. ప్రతిరోజు అమ్మవార్లకు వివిధరకాల నైవేద్యాలను నివేదించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేస్తుంటారు. ఈ అమ్మవార్ల దర్శనం సర్వ పాపక్షయం అని పురాణ వచనం.

- జంగం శ్రీనివాసులు 8374894743