పర్యాటకం

కరుణాతరంగ శ్రీ అలిమేలుమంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పరమాత్ముడైన హరి పట్టపురాణిని నీవు
ధరమము విచారించ తగు నీకు అమ్మా..’’
......
అలరులు కురియగ నాడనదే
అలకల గులుకుల నలవేలుమంగ..
....
ప్రేమగా శ్రీవేంకటనాధుడి ప్రసాదాన్ని స్వయంగా తినిపించి తిరుమల క్షేత్రానికి దారి చూపినఅమ్మ శ్రీ పద్మావతీదేవిని గురించి అన్నమయ్య ఇలా పాడుతూ తరించాడు. ఆ అలకల కులుకుల రాణి అమ్మవారు ...
కరుణామయి, ప్రేమ స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మి కలియుగంలో భక్తుల విన్నపాలను పతికి విన్నవించడం కోసమే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉరమెక్కి కూర్చున్నది. తిరుమలేశుడి హృదయంలో శ్రీవ్యూహలక్ష్మిగా కొలువుదీరిన కరుణాంతరంగ శ్రీ అలిమేలుమంగ శ్రీ పద్మావతీ అమ్మవారుగా ‘తిరుచానూరు’ క్షేత్రంలో కొలువుదీరి నిత్యం పూజలందుకుంటూ వుండడంతోపాటూ ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో బ్రహ్మోత్సవాల సమయంలో వివిధ వాహనాలను అధిరోహించి భక్తులకు కన్నుల పండువ చేస్తూ దర్శనమిస్తూ వారిపై వరాల జల్లులను, కరుణామృతాన్ని కురిపిస్తూ వుంది.
శుక మహర్షి తపోభూమి.. తిరుచానూరు
తిరుపతికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న తిరుచానూరుకు పూర్వం ‘శ్రీశుకనూరు’ అనే పేరు వుండేది. పూర్వం శుక మహర్షి దేశాటన చేస్తూ ఇక్కడకు చేరుకుని స్వర్ణమునీ నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేయసాగాడు. క్రమంగా మహర్షిని చూసి ప్రజలు వచ్చి నివాసాలు ఏర్పరచుకోవడం ఒక వూరు ఏర్పడి మహర్షి పేరుమీద దానికి ‘శ్రీశుకనూరు’ అనే పేరు ఏర్పడింది. శ్రీ శుకనూరు తమిళంలో ‘తిరుగచ్చనూరు’గా పిలువబడి ప్రజల వాడుకలో క్రీ.శ.15వ శతాబ్దం తర్వాత ‘తిరుచానూరు’ అయింది. తిరుచానూరుకే ‘అలిమేలుమంగాపురం’, ‘అలిమేలు మంగపట్నం’ అని కూడా పేర్లు వున్నాయి. శ్రీ పద్మావతీదేవిని తమిళంలో ‘అలర్‌మేల్ మంగై’ అని పిలుస్తారు. అంటే ‘తామర పువ్వుపై వున్న స్ర్తి’ అని అర్థం. అలిమేలు మంగాదేవి నివాసం వుండేవారు కాబట్టి ‘అలిమేలు మంగాపురం’ అని పేరు ఏర్పడింది.
అమ్మవారి ఆవిర్భావం
లోకంలో ధర్మం నశించి అధర్మం అధికమైన స్థితిలో ధర్మ రక్షణకు సప్తర్షులు యజ్ఞం చేసి యజ్ఞ హవిర్భావాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పించాలో నిర్ణయించే బాధ్యతను భృగుమహర్షికి అప్పగించారు. భృగుమహర్షి సత్యలోకం, కైలాసం చేరి బ్రహ్మ, శివుడులు వారి వారి పనుల్లో మునిగి తనను పట్టించుకోకపోవడంతో వారిని శపించి వైకుంఠం చేరుకున్నాడు. ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవితో ముచ్చట్లు ఆడుతూ మహర్షిని గమనించకపోవడంతో ఆవేశపూరితుడైన మహర్షి విష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నడంతో శ్రీ మహావిష్ణువు మహర్షిని ఆహ్వానించి ఆసనంపై కూర్చుండబెట్టి సేవ చేస్తూ వున్నట్లుగా కాళ్ళు వత్తుతూ అరికాలిలో వున్న కంటిని నొక్కివేయడంతో భృగుమహర్షి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడంతో మహర్షిని విష్ణువు క్షమించాడు. తన స్థానమైన విష్ణువు వక్షస్థలంపై భృగుమహర్షి కాలితో తన్నినా తన పతి సేవ చేయడాన్ని సహించలేని శ్రీ మహాలక్ష్మీదేవి అలిగి భూలోకం చేరింది. ఆమెను వెతుక్కుంటూ శ్రీమహావిష్ణువు భూలోకం చేరి వెదకసాగాడు.
ఇలాంటి సమయంలో ఒకనాడు-
‘‘స్వర్ణముఖీనదీ తీరంలో ఒక సరోవరాన్ని నిర్మించి స్వర్ణకమలంను స్థాపించి.. దేవలోకం నుంచి బంగారు కమలలాను తెప్పించి పనె్నండేళ్ళపాటు పూజిస్తే శ్రీ మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది’’ అనే మాటలు వినిపించాయి.
ఈ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు తిరుచానూరులో పద్మసరోవరాన్ని ఏర్పాటుచేసి.. పనె్నండు సంవత్సరలపాటు శ్రీమహావిష్ణువు పూజించగా.. కార్తీకమాసంలో ‘పంచమి’ శుక్రవారంనాడు సరోవరంలోని ‘కాంచన పద్మం’లో ప్రత్యక్షమై.. తిరుచానూరులో కొలువుదీరింది. అందుకే కార్తీకమాసంలోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు..!!
కరివేపాకు
ప్రచారంలో వున్న మరో గాథ ప్రకారం శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత నూతన దంపతులు పర్వతారోహణ చేయరాదనీ, అగస్త్య మహాముని చెప్పగా.. అగస్త్య మహర్షి ఆశ్రమం వద్ద కొంతకాలం నివాసం వున్నారు. అదే ‘శ్రీనివాసమంగాపురం’! ఆ తర్వాత కొంతకాలానికి వేంకటాచలానికి ప్రయాణం కాగా ఆకాశరాజు తన కుమార్తె, అల్లుళ్ళకు వస్త్భ్రారణాలు, వివిధ వస్తు వాహనాలు, దాసదాసీజనాలు, సారెలను ఇచ్చి పంపాడు. కొండనెక్కడం ప్రారంభించారు. కొంతదూరం ప్రయాణించాక ‘కరివేపాకు తెచ్చావా?’ అని శ్రీనివాసుడు పద్మావతీదేవిని అడగ్గా ‘తేలేదు’ అని సమాధానం ఇచ్చింది. వెంటనే శ్రీనివాసుడు-
‘‘తిరుమల కొండలలో కరివేపాకు దొరకదు. ఈ వస్తువులను ఇక్కడే వుంచి వెనక్కు వెళ్ళి కరివేపాకు ఎండించి మూట కట్టుకుని తీసుకునిరా’’ అని చెప్పడంతో శ్రీ పద్మావతీదేవి పరివారాన్ని వెంటబెట్టుకుని కరివేపాకుకై వెళ్లి.. కొంతకాలం కరివేపాకుకోసం తిరుచానూరులో ఉండవలసి వచ్చింది. ఈ విధంగా శ్రీ పద్మావతీదేవి తిరుచానూరులో కొలువుదీరినట్లు కథనం.
‘చొచ్చితి తల్లీ! మీ మరుగు
సొంపుగ నీ కరుణాకటాక్ష మె
ట్లబ్బెదో నీకు నేడు పర
మేశ్వరీ! యో యలమేలు మంగ..’’’
..............
చక్కని తల్లికి ఛాంగుభళా తన
చక్కెర మోవికి ఛాంగుభళా..’’ అంటూ కీర్తనలతో ఆ కరుణాంతరంగ అలిమేలు మంగమ్మను అన్నమయ్య కీర్తించినట్లే మనమూ అన్నమయ్య కీర్తనలలాపిస్తూ అమ్మను సేవిద్దాం.
ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షః స్థల నిత్యవాసర సికాం తత్‌క్షాంతి సంపర్దినీమ్
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనాం శ్రీయం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్

15 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కార్తీకమాసంలో జరుగుతాయి. తమిళ కార్తీకమాసం శుక్లపక్షం పంచమినాడు ముగిసేటట్లు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. నవంబర్ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజులూ శ్రీ పద్మావతీ దేవి ఉత్సవమూర్తి వివిధ వాహనాలను అధిరోహించి తిరువీధులలో ఊరేగుతూ భక్తులకై కరుణామృతాన్ని కురిపిస్తుంది. తొలి రోజు తిరుచ్చి ఉత్సవం అనంతరం ధ్వజారోహణ జరగడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటిరోజు రాత్రి పెద్ద శేష వాహనం, రెండో రోజు పగలు చిన్న శేష వాహనం, రాత్రి హంసవాహనం, మూడోనాడు పగలు ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింగవాహనం, నాలుగవనాడు పగలు కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమద్వాహనం, ఐదో రోజు పగలు పల్లకీ వాహనం, రాత్రి గజవాహనం, ఆరవ రోజు పగలు సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, ఏడవ రోజు పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభవాహనాలను అధిరోహించే శ్రీ పద్మావతీ అమ్మవారు ఎనిమిదవ రోజు రథాన్ని అధిరోహించి తిరుచానూరు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నయానందాన్ని కలిగిస్తారు. ఎనిమిదవ రోజు రాత్రి అశ్వవాహన సేవ జరుగుతుంది. తొమ్మిదోరోజు పగలు తిరుచ్చీ ఉత్సవం జరుగుతుంది. రాత్రి పంచమీ తీర్థం, చక్రస్నానం, ధ్వజారోహణ కార్యక్రమాలు జరగడంతో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించే భక్తుల జన్మ జన్మల పాపాలు హరింపబడి, అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం.
చక్కని తల్లికి ఛాంగుభళా!
తిరుచానూరులో ఆలయానికి కొద్ది దూరంలో పుష్కరిణి వుంది. ‘పద్మసరోవరం’గా పిలువబడే ఈ సరోవరంనుంచే శ్రీ పద్మావతీ అమ్మవారు ఆవిర్భవించింది. విశాలమైన ప్రాంగణంలో వున్న ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ద్వారంపై ఐదంతస్తుల శిల్పకళా శోభితమైన గోపురం నిర్మింపబడి వుంది. రంగమండపం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయాలు వున్న ప్రధాన ఆలయ రంగమండపంలోని స్తంభాలు అద్భుతమైన శిల్పకళా సంపదతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీపద్మావతీ అమ్మవారు పద్మాసన స్థితిలో చతుర్భుజిగా రెండు చేతులలో పద్మములను, మరో రెండు చేతులలో అభయ వరద ముద్రలను ధరించి దివ్య మంగళ స్వరూపంతో దర్శనమిస్తుంది. ముఖమండపంలో రామానుజాచార్యులు, గరుడాళ్వారు, విష్వక్సేనులను దర్శించుకొనవచ్చు. అమ్మవారి ఆలయానికి కుడివైపున వున్న ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరద రాజస్వామివారు పూజలందుకుంటూ వున్నాడు. ఈ ఆలయం ప్రక్కనే వున్న ఆలయంలో శ్రీపార్థసారధి స్వామి వారు కొలువుదీరి దర్శనమిస్తారు.