ఆంధ్రప్రదేశ్‌

పట్టిసం ఎత్తిపోతలతో 13 లక్షల ఎకరాల స్థిరీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలవనరుల శాఖ మంత్రి దేవినేని
పోలవరం, మార్చి 13: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా కృష్ణా, రాయలసీమ జిల్లాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన పట్టిసం ఎత్తిపోతల నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉదయం మంత్రి పీతల సుజాతతో కలిసి ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పట్టిసం ఎత్తిపోతల పథకం ద్వారా 80 టిఎంసిల నీరు కృష్ణా డెల్టాకు అందిస్తామని, దీంతో 13లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందన్నారు. పట్టిసం పనులు వేగంగా పూర్తవ్వడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు సహకరించిన వారందరికీ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేయడానికి కృషిచేస్తున్నామని మంత్రి దేవినేని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.121 కోట్లు విడుదల చేశామని, ముందుగా ఖాళీ చేయవలసిన ఏడు గ్రామాల్లో ఇప్పటికే మూడు గ్రామాల ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించామన్నారు. ప్రాజెక్టు పనుల్లో ప్రస్తుతం 1.15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీస్తున్నామని, రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేందుకు అధునాతన యంత్రాలు వస్తున్నట్టు తెలిపారు. కేంద్రం నుండి అధిక నిధులు మంజూరు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని సంప్రదిస్తున్నారన్నారు. అలాగే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన వ్యయ వివరాలు, నిర్మాణ పనులను గూర్చి ఇంజనీరింగ్ అధికారులు ఢిల్లీ వెళ్లి మంత్రి ఉమాభారతికి, అధికారులకు వివరించారన్నారు. మంత్రుల వెంట తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పోలవరం ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల రైతులు ఉన్నారు.