ఆంధ్రప్రదేశ్‌

హోదా సాధించేంత వరకూ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటి సంతకాలతో ఢిల్లీకి పిసిసి నేతలు

విశాఖపట్నం, మార్చి 12: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకూ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంతంగా పోరాడుతుందని ఎపి పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. విభజన హామీల అమలు కోరుతూ పిసిసి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల బృందం విశాఖ నుంచి శనివారం ఎపి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయలుదేరింది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి నిధులు, ఆర్థిక లోటు భర్తీ వంటి హామీలను చట్టంలో పొందుపరిచారన్నారు. విభజన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల్లో అప్పటి విపక్షం భారతీయ జనతాపార్టీ చేసిన వ్యాఖ్యలను విస్మరించిందన్నారు. చట్టసభల సాక్షిగా బిజెపి రాష్ట్ర ప్రజలను మోసగించిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక లోటును భర్తీ చేయడంతో పాటు రాజధాని నిర్మాణానికి కనీసం నిధులు కేటాయించలేదని ఆరోపించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లో నూతన రైల్వేజోన్ ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు.
రాజధాని నిర్మాణానికి సైతం కేంద్రం నిధులు మంజూరు చేయలేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రజల ఆకాంక్ష అని అన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రఘువీరా డిమాండ్ చేశారు. హోదాతో పాటు విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పూర్తి చేశామని, రాష్ట్ర ప్రజల కోర్కెను ప్రధాని మోదీకి వివరించేందుకే ఢిల్లీ యాత్ర చేపట్టినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ తదితరులను కలసి హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడనున్నట్టు ఆయన వెల్లడించారు. విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరిన బృందంలో రఘువీరాతో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, కాంగ్రెస్, జిల్లా, నగర పార్టీల అధ్యక్షులు పి.బాలరాజు, బెహరా భాస్కరరావు, పెద్ద సంఖ్యలో నాయకులు ఉన్నారు.