ఆంధ్రప్రదేశ్‌

‘పెన్నా’ పొడవునా విస్తారంగా కింబర్‌లైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల రోజులుగా మట్టి, రాళ్లు సేకరణ పరీక్షలకు వజ్రకరూరుకు తరలింపు
కడప, మార్చి 14: కడప సమీపంలోని సిద్దవటం, చెన్నూరు, వల్లూరు మండలాల పరిసర ప్రాంతాల్లో పెన్నా నది పొడవునా అత్యంత విలువైన కింబర్‌లైట్ ఖనిజ నిక్షేపాలు విస్తారంగా ఉండటంతో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్తవ్రేత్తలు గత కొంతకాలంగా అనే్వషణ సాగిస్తున్నారు. ఈ మేరకు పెన్నానది ఒడ్డున పరిసర ప్రాంతాల్లో నెల రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు చేసి వివిధ ప్రాంతాల నుంచి కింబర్‌లైట్ నిక్షేపాలు ఉన్న మట్టి, రాళ్లను అనంతపురం జిల్లా వజ్రకరూరుకు తరలించి, అక్కడ పరీక్షలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు వద్ద వున్న ప్రాసెసింగ్ యూనిట్ పరీక్షల్లో ఇక్కడ విలువైన వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు తేల్చారు. జియాలజికల్ సర్వేశాఖతో పాటు ఢిల్లీకి చెందిన పలు సంస్థలు చాలాకాలంగా ఇక్కడ వజ్రాలపై పరిశోధనలు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న యోగి వేమన విశ్వవిద్యాలయం సంబంధిత శాఖ అధికారులు కూడా పెన్నా నది పరివాహకంలో వజ్రాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. గతంలో పెన్నా నది పారుదల వల్ల వర్షాకాలంలో వరదనీటితో కొట్టుకువచ్చి పెన్నానది పొడవునా నీరు పారడంతో వజ్రాలు ఒడ్డుకు చేరినట్లు నిర్ధారించారు.
కాలక్రమంలో ఆ ఖనిజ సంపద అంతా మట్టిలో కూరుకుపోతుంది. అత్యంత విలువైన కింబర్‌లైట్ ఖనిజం ఇక్కడ ఉన్నట్లు శాస్తవ్రేత్తలు నిర్ధారించారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ డైరెక్టర్ డాక్టర్ సుందరం కూడా గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి పెన్నానది పొడవునా 20 ప్రాంతాలకు పైబడి మట్టిని సేకరించి ఢిల్లీ ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించారు. వజ్ర నిక్షేపాలు, విలువైన కింబర్‌లైట్ ఖనిజం ఆ మట్టిలో ఉన్నట్లు నిర్ధారించారు. బ్రిటీషు పాలనలో ఈ ప్రాంతాల్లో వజ్రాలు తవ్వుకుని జమ్మలమడుగు గండికోటలో స్థావరంగా వజ్రాల వ్యాపారం చేసేవారని తెలుస్తోంది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించి కర్నూలు జిల్లా నందికొట్కూరు, బనగానపల్లె, నంద్యాల, అనంతపురం జిల్లా ఉరవకొండ, గుంతకల్లు, వజ్రకరూరు ప్రాంతాల్లో ఈ తరహా నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కింబర్‌లైట్ ఖనిజం పెన్నా నది తీరం పొడవునా లభిస్తుందని శాస్తవ్రేత్తలు గుర్తించి ఈ ప్రాంతంలో పెన్నానది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల పొలాల్లో తవ్వకాలు ముమ్మరం చేశారు. మొత్తం మీద కడప జిల్లాలో వజ్రాలు ఉన్నట్లు తేలడంతో మట్టిని సేకరించి ఆ మట్టిని ప్రాసెసింగ్ చేసేందుకు అనంతపురం జిల్లా వజ్రకరూరుకు తరలిస్తున్నారు.