రాష్ట్రీయం

వికలాంగులకు హక్కులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు ముట్టడి పోస్టర్ ఆవిష్కరణలో చుక్కా రామయ్య

హైదరాబాద్, నవంబర్ 30: వికలాంగులకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని విద్యావేత్త చుక్కా రామయ్య కోరారు. డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల సమస్యలపై పోరాడేందుకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ ఆ రోజు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. పార్లమెంటును ముట్టడికి పిలుపునిస్తూ తయారు చేసిన పోస్టర్‌ను చుక్కా రామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు రాజ్యాంగబద్దంగా కొన్ని హక్కులు సంక్రమించాయని, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. వికలాంగులు పార్లమెంటు ముందు ప్రదర్శన చేయడం చారిత్రాత్మకమని అన్నారు. వికలాంగుల హక్కుల సమస్యలు పరిష్కరించి, వికలాంగుల నూతన చట్టాన్ని ఆమోదించాలని, వికలాంగులకు దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ వైకల్య గుర్తింపు కార్డు ఉండాలని, ప్రత్యేక కమిషన్ వేసి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, యుగేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.జానకి, వెంకట్ పాల్గొన్నారు.