ప్రసాదం

యద్భావం తద్భవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ కుందేలు భూమాత దగ్గర కొంత మొత్తాన్ని అప్పు తీసుకుంది. అప్పైతే తీసుకుంది కానీ తీర్చటం ఏ మాత్రం కుందేలుకి ఇష్టం లేదు. తను వున్న ప్రదేశం వదిలి కొత్త ప్రదేశానికి వెళ్లిపోతే భూమాత అక్కడకి రాలేదు. కాబట్టి అప్పు తీర్చాల్సిన అవసరం ఉండదని సంబరపడిపోయింది.
ఓ రోజు దూరంగా వున్న అడవిలోకి వెళ్లిపోయింది. దట్టంగా ఉన్న చెట్ల నడుమ ఎవరికీ కనిపించకుండా ఉండే ఓ స్థలంలో హాయిగా కూచుంది. అమ్మయ్యా! అప్పు తీర్చమని భూదేవి నన్నడగలేదు అని అనుకుంది. సంతోషంతో ఊపిరి పీల్చుకుంది కుందేలు.
అలా కుందేలు అనుకుందో లేదో వెంటనే ‘‘ఏయ్! నేను ఇక్కడ ఉండననేగా నీ ధీమా? నేను ఇక్కడే.. నీ అడుగుల కిందే ఉన్నాను. నన్ను తప్పించుకోవడం నీ తరం కాదు. నా అప్పు తీరుస్తావా? లేదా?’’ అంది భూమాత.
కుందేలు తెల్లమొహం వేసింది.
భగవంతుని విషయమూ అంతే! అతడు సర్వాంతర్యామి!
భగవంతుడు ఓసారి మాయని పిలిచి ‘‘నన్ను అందరూ మాయావినోదిని అని అంటున్నారు. నువ్వు నా నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో’’ అని అంటాడు.
‘‘నేను మిమ్మల్ని విడచి మీకు దూరంగా మీరు లేని చోటుకి వెళ్లిపోతాను. అయితే మీరు లేని చోటు ఎక్కడో నాకు మీరే చూపించండి? నేనక్కడికి వెళ్లిపోతాను’’ అని మాయ భగవంతుడ్ని అడుగుతుంది.
సమాధానం లేక భగవంతుడు మిన్నకుండిపోతాడు. భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్పేందుకు మరో ఉదాహరణ.
జీవుడు దేవుడినుంచి ఎప్పుడూ ఎన్నటికీ తప్పించుకోలేడు. దేవుడు ఉండని చోటనేది ఉండనే ఉండదు.
విజ్ఞానశాస్త్రం బాగా చదువుకున్న ఓ యువకుడికి ఓసారి ఓ పెద్ద సమస్య వచ్చింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో దేవుడ్ని ప్రార్థించడం మొదలుపెట్టేడు.
ఇదంతా గమనించిన ఓ నాస్తికుడు ఆ యువకుడి దగ్గరకొచ్చేడు. ‘‘నీ ప్రార్థన ఆ దేవునికి వినిపిస్తుందా? ఆదేవుడు ఎక్కడ ఉంటాడు? ఎంత దూరంలో ఉంటాడు?’’ అని వ్యంగ్యంగా ప్రశ్నించేడు.
‘‘నా పిలుపు ఎంత దూరం వరకు వినిపిస్తుందో అక్కడ.. ఆ దేవుడు తప్పకుండా ఉంటాడు. భగవంతుడు ఉండే చోటుని చేరేటంతవరకు నా ప్రార్థన (పిలుపు) సజీవంగా వుంటూ, వినిపిస్తూనే వుంటుంది’’ అచంచలమైన విశ్వాసంతో ఆ యువకుడు సమాధానమిస్తాడు.
భగవంతుడు దగ్గరగా ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు అని మనం అనుకుంటే- మన ప్రక్కనే భగవంతుడుంటాడు. మనకి దూరంగా భగవంతుడు ఎక్కడో ఉంటాడనుకుంటే మనకి అందనంత దూరంలో ఉంటాడు భగవంతుడు.
భగవంతుడు ఉండటం ఉండకపోవటం అనేది భక్తుని భావం మీద ఆధారపడి ఉంటుంది. భక్తుడి విశ్వాసంలో ముడిపడి వుంటుంది.
విశ్వాసమెక్కడో భక్తి అక్కడ! భక్తి ఎక్కడో భగవంతుడక్కడ!

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669