క్రైమ్/లీగల్
త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మద్దిపాడు, మే 28 : జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున మద్దిపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం చెన్నై నుండి మహబూబ్ నగర్‌కు వెళుతున్న ఎల్‌పిజి గ్యాస్ ట్యాంకర్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మద్దిపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగింది. ట్యాంకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులు డ్రైవర్‌ను అతి కష్టం పై బయటకు తీసి ఒంగోలు కిమ్స్‌లో చేర్పించి అనంతరం రిమ్స్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని ఒంగోలు రూరల్ సీఐ ఎం మురళీకృష్ణ పరిశీలించారు. ఎల్‌పిజి ట్యాంకర్ లారీని ఢీ కొట్టి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని పోలీసులు ఆందోళన చెందారు. ట్రాఫిక్‌ను సర్వీస్ రోడ్డుకు మళ్లించి ట్యాంకర్‌ను లారీ నుండి విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎస్ ఐ సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.