క్రైమ్/లీగల్

కురిచేడు పోస్టుమాస్టర్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, ఆగస్టు 29: కురిచేడు బ్రాంచ్ పోస్ట్ఫాసులో పనిచేస్తూ వారంరోజుల కిందట పొదిలికి బదిలీపై వెళ్లిన పోస్టుమాస్టర్ షేక్ అన్వర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కురిచేడు బ్రాంచ్ పోస్ట్ఫాసులో పనిచేస్తున్న సమయంలో కొన్ని ఖాతాల నుంచి అక్రమంగా నిధులు డ్రా చేసినట్లు ఆయనపై అభియోగం మోపబడింది. కురిచేడు పోస్ట్ఫాసు పరిధిలోని కొన్ని ఖాతాలు గత కొనే్నళ్ళ నుంచి లావాదేవీలు లేకుండా స్థబ్దుగా ఉన్నాయి. అలాంటి ఖాతాలను గుర్తించి ఆయా ఖాతాలను రద్దుచేసి నగదు డ్రా చేసినట్లు పోస్టల్ ఇన్స్‌పెక్టర్ విచారణలో బహిర్గతమయ్యాయి. ఏళ్ళతరబడి నిద్రావస్థలో ఉన్న ఖాతాలను ఒక్కసారిగా రద్దు చేయడంతో పోస్టల్ ఉన్నతాధికారులకు అనుమానాలు రేకెత్తాయి. ఈనెల 3వతేదిన 10 ఖాతాలను రద్దు చేయడంతో ఉన్నతాధికారులు కురిచేడు పోస్ట్ఫాసుపై దృష్టి సారించారు. ఈనెల 23వతేదిన పొదిలి ఏరియా పోస్టల్ ఇన్స్‌పెక్టర్ కురిచేడు తాపాలా కార్యాలయంలో విచారణ చేశారు. వారి విచారణలో మొదటిరోజు లక్షా 26వేల రూపాయల నగదు, రెండవరోజు విచారణలో 5లక్షల రూపాయల పైచిలుకు లావాదేవీలులేని ఖాతాలను రద్దుచేసి డ్రా చేసినట్లు బహిర్గతమైంది. వెంటనే ఆయా పోస్టుమాస్టర్‌చే డ్రా చేసిన నిధులను తిరిగి ఆయా ఖాతాలకు జమ చేశారు. సదరు పోస్టుమాస్టర్‌ను వెంటనే పొదిలికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన పొదిలిలో పని చేస్తుండగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. కాగా విచారణ అధికారిగా నియమితులైన పొదిలి ఏరియా పోస్టల్ ఇన్స్‌పెక్టర్ యలమందయ్యను వివరణ కోరగా తమ విచారణలో బహిర్గతమైన నిజాలను నివేదిక రూపంలో పోస్టల్ సూపరింటెండెంటువారి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. విచారణ ప్రాధమికదశలో ఉందని, మరింత విచారణ జరగాల్సి ఉందన్నారు. పోస్టుమాస్టర్ సస్పెన్షన్ విషయం పత్రికలకు విడుదల చేసేస్థాయి తనది కాదని, పోస్టల్ సూపరింటెండెంటు వారికి నివేదిక సమర్పించానని, వారి ద్వారా వివరాలు తెలుసుకోవాల్సిందిగా ఆయన సమాధానం చెప్పారు. ఇదిలా ఉండగా కురిచేడు పోస్ట్ఫాసు పరిధిలో విచారణ కొనసాగుతున్న దశలో ఇప్పటికే 30 లక్షల రూపాయల మేరకు నిధులు డ్రా చేశారని, అయితే స్థానిక పొదుపు ఏజెంట్ల ప్రమేయం లేకుండా పోస్టుమాస్టర్ ఒక్కరే నిధులు ఎలా డ్రా చేయగలరని పొదుపుదారులు ప్రశ్నిస్తున్నారు.