క్రైమ్/లీగల్

దర్శి కిడ్నాప్, మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 5: జిల్లాలోని గిద్దలూరు కారు డ్రైవర్ కేశవును, దర్శి బంగారు నగల వ్యాపారి ఆదినారాయణను అత్యంత కిరాతకంగా హతమార్చిన నలుగురు నిందితులను తన ఆదేశాల మేరకు దర్శి డిఎస్‌పి నాగేశ్వరరావు స్వీయ పర్యవేక్షణలో అద్దంకి సీఐ హైమారావు తన సిబ్బంది సహాయంతో మంగళవారం నరసరావుపేటపట్నం బరంపేటలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు నేరాలకు సంబంధించిన 20 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి బి సత్యఏసుబాబు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్‌పి సత్యఏసుబాబు మాట్లాడుతూ ఈ కేసులో దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన గోపిశెట్టి నాగ మల్లేశ్వరరావు, ముండ్లమూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన గుండాల రాజశేఖర్‌రెడ్డి, అద్దంకి మండలం చెరువుకొమ్ముపాలెంకు చెందిన మనె్నం కోటేశ్వరరావు, గర్నెపూడి సురేష్‌ను అద్దంకి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్‌పి తెలిపారు. ముద్దాయిల నేపధ్యం గురించి ఎస్‌పి సత్య ఏసుబాబు వివరిస్తూ ఈ కేసులో ముఠా నాయకుడైన నాగమల్లేశ్వరరావు చిన్నతనంలో ఆరవ తరగతి వరకు చదువుకుని కుటుంబ అవసరాల కొద్ది చదువుమానేసి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడని ఎస్‌పి తెలిపారు. తదుపరి కారు డ్రైవర్‌గా పనిచేస్తూ వివాహం చేసుకుని భార్య చనిపోయిన తరువాత కృష్ణవేణి అనే మహిళతో సహజీవనం చేస్తూ చిలకలూరిపేట, నరసరావుపేట, అద్దంకి, దరిశి ప్రాంతాలలో ఆమెతో వ్యభిచారగృహాలు నడిపినట్లు ఎస్‌పి తెలిపారు. 2015వ సంవత్సరంలో దర్శి పోలీసులు వ్యభిచార కేసులో నాగమల్లేశ్వరరావుని అరెస్ట్ చేసినట్లు ఎస్‌పి తెలిపారు. గుండాల రాజశేఖర్‌రెడ్డి అనే అతను డిగ్రీవరకు చదువుకుని కొంతకాలం అద్దంకిలో ఒక హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్‌పి తెలిపారు. మనె్నం కోటేశ్వరరావు అనే అతను ఒంగోలు పేస్ కాలేజిలో ఎంబిఎ మొదటి సంవత్సరం చదువుతూ, ప్రేమ వ్యవహారంలో జరిగిన గొడవ కారణంగా ప్రస్తుం హైదరాబాద్‌లో తన బంధువుల ఇంటి వద్ద ఉంటున్నట్లు ఎస్‌పి తెలిపారు. గర్నెపూడి సురేష్ అనే అతను 2016 సంవత్సరంలో ఐటిఐ పూర్తిచేసి తదుపరి కొంతకాలం అద్దంకిలో హాల్‌టింగ్ డ్రైవర్‌గా పనిచేసి ప్రస్తుతం హిందూపురంలో విప్రోకంపెనీలో క్వాలిటీ టెస్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకొంటున్నట్లు ఎస్‌పి తెలిపారు. కిడ్నాప్ ముఠా నాయకుడైన గోపిశెట్టి నాగ మల్లేశ్వరరావు కుటుంబపరిస్థితుల నేపద్యంలో మొదటిగా కారుడ్రైవర్‌గా పనిచేసి, భార్య చనిపోయిన తరువాత మరొక మహిళతో సహాజీవనం చేసి చెడు వ్యసనాలకు అలవాటు బానిసై వివిధ ప్రాంతాలలో ఆమెతో వ్యభిచార గృహాలు నడిపించి అనేక మంది ధనవంతులతో పరిచయాలు ఏర్పరచుచుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఈ క్రమంలో తమ అవసరాలకు సరిపడ డబ్బులు అందకపోవడంతో నేర ప్రవవృత్తిని ఎంచుకుని దర్శి మండలంలోని చింతలపూడి గ్రామానికి చెందిన గుండాల రాజశేఖర్‌రెడ్డిని మొదటిగా తన సరసన చేర్చుకుని తదుపరి అతని ద్వారా అద్దంకి మండలంలోని చెరువుకొమ్ముపాలెంకు చెందిన సురేష్, కోటేశ్వరరావులను తన ముఠాలలో చేర్చుకుని, వారితో కలిసి నేరాలు చేయడం మొదలు పెట్టినట్లు ఎస్‌పి తెలిపారు. వీరు పలునేరాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని ఎస్‌పి తెలిపారు. ముఖ్యంగా 2018 ఆగస్టు 14న దర్శి ప్రాంతానికి చెందిన నగలు వ్యాపారి ఒగ్గు ఆదినారాయణ ను ముఠా సభ్యులందరూ ఒక పధకం ప్రకారం అద్దంకిలోని ఒక రూముకు పిలిపించి అక్కడ అతనిని బంధించి చంపుతామని బెదిరించి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసి, చివరకు 5 లక్షల రూపాయలు తెప్పిస్తానని ఆదినారాయణ వారికి చెప్పడంతో దానిని వారు ఒప్పుకొని డబ్బు తెప్పించమనగా ఆదినారాయణ తన స్నేహితుడు ద్వారా తెప్పించగా ఆ డబ్బులు తీసుకొని, అతని గొంతుకు గుడ్డ బిగించి చంపివేసి, అతని వద్ద గల బంగారు చైను, రెండు బంగారు ఉంగరాలు, పర్సు, సెల్‌ఫోను, ఎటియం కార్డు తీసుకొని అతని శవాన్ని అతని కారులోనే ఎక్కించుకొని ఆదినారాయణ శవాన్ని త్రిపురాంతకం సమీపంలో పడవేసి శవాన్ని పెట్రోల్ పోసి తగుబెట్టి, అక్కడ నుండి ఆదినారాయణ కారును తీసుకొని వెళ్ళి పామూరు బస్టాండ్ వద్ద వదిలిపెట్టినట్లు తెలిపారు. పోలీసుల దృష్టి మల్లించేందుకు ఆదినారాయణకు చెందిన ఫోనులోని సిమ్‌కార్డును, కొత్త్ఫోనులో వేసి, సదరు ఫోన్‌ను రోడ్డు మీద పోతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీలో పడవేసినట్లు ఎస్‌పి తెలిపారు. ఇదిలా ఉండగా అరెస్ట్‌చేసిన ముద్దాయిల వద్ద నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు గురించి ఎస్‌పి వివరిస్తూ, గిద్దలూరు పియస్ కేసుకు సంబంధించిన మృతుడి కి చెందిన వివొ మొబైల్‌ఫోన్, బంగారుచైన్, రెండు బంగారు ఉంగరాలు, పర్సు నాలుగు బ్యాంకు ఎటియం కార్డులు, స్విప్ట్ కారు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వాటర్ కార్డు, అతని భార్య ఆధార్ కార్డు, 4లక్షల 2వేల రూపాయల డబ్బులు, మార్కాపురంలో ముఠానాయకుడు నాగమలేశ్వరరావు దొంగిలించిన , ఈ నేరాలను చేసేందుకు ఉపయోగించిన ప్లాటినా మోటార్ సైకిల్, నేరాలు చేసేందుకు ఉపయోగించిన నాగమల్లేశ్వరరావుకి చెందిన కారు. ఒక కత్తి, ముద్దాయిలు వాడిన మొత్తం 9 మొబైల్‌ఫోన్స్, వాటి సిమ్‌కార్డ్స్, మొత్తం స్వాధీనం చేసుకున్న కేసు ప్రాపర్టీ విలువ 12 సవర్ల బంగారు ఆభరణాలతో కలిపి మొత్తం 20 లక్షల రూపాయులు ఉంటుందని ఎస్‌పి తెలిపారు. 8 నెలలుగా పోలీసులుకళ్లు గప్పి వివిధ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న కిడ్నాప్ ముఠాను దర్శి డి ఎస్‌పి కె నాగేశ్వరరావు, స్వీయ పర్యవేక్షణలో అత్యంత చాకచక్యంగా అరెస్ట్‌చేసిన అద్దంకి సర్కిల్ పోలీసులను ఎస్‌పి బి సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ విలేఖర్ల సమావేశంలో ఎఎస్‌పి లావణ్య లక్ష్మి తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.