ప్రసాదం

నిజమైన భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజలు, వ్రతాలు నోములు చేయటం భక్తి కాదు. భక్తి సాధనాలు, భక్తిని సాధించటానికి వంటపట్టించుకోటానికి చేసే అభ్యాసాలు అభిషేకాలు, ఆరాధనలు, అర్చనలు, నైవేధ్యాలు, ఉపవాసాలు, పారాయణాలు జాగరణలు భక్తి కాదు. అవి కూడా భక్తి సాధనకు ఉపయోగడే సాధనాలు. ఉపకరణాలు. సాధారణంగా, స్థూలంగా మనం రెండూ ఒకటే అనుకుంటుంటాం. అనుకుంటున్నాం.
భక్తి అంటే ఏమిటి? భగవంతుడ్ని ప్రేమించటం భక్తి. భగవంతుడి కోసం అర్రులు చాచటం భక్తి. ఆరాట పడటం భక్తి. భగవంతుని కోసం ఏడ్వటం భక్తి. బాధ పడటం భక్తి. భగవంతుడికి అన్నీ ఆర్పణ చేయటం భక్తి. కష్టంలోను, కన్నీళ్లలోను, బాధలలోను ప్రతి స్థితిలోను ప్రతీ పరిస్థితిలోను, ప్రతి అవస్థలోను వ్యవస్థలోను, అన్నిటిలోను, అంతటిలోను భగవంతుడ్ని చూడగలగటమే భక్తి. అనుక్షణం ప్రతిక్షణం అనువణువునా ఆ భగవంతుడ్ని హృదయంలో ఉంచుకోగలగటం భక్తి. భగవంతుడి కోసం వేదన పడటం భక్తి. రోదన చేయటం, భగవంతుడ్ని అనుభవించటం భక్తి. అనుభవంలోకి తెచ్చుకోవటం భక్తి.
ఓ సమయంలో ఓ దేవాలయంలో ఓ పండితుడు తమ శిష్యులతో పాటు అందరికీ బోధిస్తున్నాడు. ముందు భగవద్గీత శ్లోకాలను చదివేడు. చదువుతున్న దానిని శిష్యులు వల్లె వేస్తున్నారు. శిష్యులంతా భగవద్గీత గ్రంథాన్ని చేతిలో పట్టుకుని ఆ పండితుని వ్యాఖ్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. అందరూ ఆ భగవద్గీత పారాయణలోను, పండితుని వ్యాఖ్యానంతోను ఆనంద పారవశ్యంలో తేలిపోతున్నారు. ఆ గుంపులో ఓ మూలన కూచున్న వ్యక్తి, ఇవేమీ పట్టనట్టు కంటికీ మంటికీ ఏకధారగా కన్నీరు కారుస్తున్నాడు. కన్నీరు ధారాపాతంగా కారుతోంది అతని కళ్లనుంచి.
అతనొక్కడు తప్ప తక్కినవారంతా సన్నివేశాని కనుగుణంగా, సందర్భానికి తగినట్టు ఓసారి నవ్వుతున్నారు. మరోసారి విచారణ చేస్తున్నట్టు తలలు ఊపుతున్నారు. మరో క్షణంలో ఆశ్యర్య పోతున్నారు. ఆనందపడుతున్నారు. మరో క్షణంలో మామూలుగా వింటున్నారు. అవునన్నట్టు తలలు ఊపుతున్నారు. భగవద్గీత పుస్తకం పేజీలు తిప్పుతున్నారు. పారాయణం శ్రవణం రెండూ ఒక్కొక్కసారి చేస్తున్నారు. పరిస్థితికి అనుగుణంగా ఒక్కొక్క మార్పును ప్రకటిస్తున్నారు. ప్రదర్శిస్తున్నారు.
మూలన కూచున్న ఆసామీ మాత్రం ఇవేమీ పట్టనట్టు తన లోకంలో తానుంటూ, అలా కంటిధారలు కారుస్తున్నారు. ఆ ఆసామీని అక్కడున్న ఒకాయన పరీక్షగా చూస్తున్నాడు. పరిశీలన చేస్తున్నాడు. కంటి ధారలు కారుస్తున్న వ్యక్తి దగ్గరకొచ్చి ‘‘ఏమయ్యా! ఇందాకట్నుంచి చూస్తున్నాను. భగవద్గీత పారాయణం, పండితుని ఉపన్యాసం ఆనంద పారవశ్యంలో సాగుతోంది. నువ్వు మాత్రం ఏకబిగిన అలా ఏడుస్తున్నావు. కారణమేంటి?’’ కన్నీరు కారుస్తున్న వ్యక్తిని అడిగేడు.
అందుకు కన్నీరు కారుస్తున్న ఆసామీ సమాధానం ఇస్తున్నాడు.
‘‘అయ్యా మీరెవరో నాకు తెలియదు. పుస్తకంలోని అక్షరాలు కూడా చదవగలిగే చదువు కూడా నాకు లేదు. ఆ సంస్కృత శ్లోకాలు నాకు రావు. పలకటం కూడా తెలీదు. తప్పులతో శ్లోకాలను పలకటం కంటే ఊరుకోవటమే మంచిది అని పలకటం లేదు. ఆ భగవద్గీత గ్రంథాన్నిచూసి, అటు ఇటు త్రిప్పి కూడా నేను నేర్చుకునేది కూడా ఏమీ లేదు. అందువల్లే నేను అన్నిటినీ వదిలి, గీతను బోధిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ చిత్రానే్న హృదయంలో చిత్రించుకుంటున్నాను. గీతను అర్జునునికి బోధిస్తున్న నా స్వామి స్థితితలచుకుంటున్నాను’’ అని ఆ ఆసామీ చెబుతున్నాడు. రెండో ఆయన వింటున్నాడు.
‘‘కురుక్షేత్రం యుద్ధంలో ఆ స్వామి అర్జునునికి బోధించేడు కదా? అందులోను రథంపై ‘సారథి’గా తాను రథంలో ముందుండి, వెనకన ఉన్న అర్జునునికి కర్తవ్య బోధ చేసాడు కదా? అంటే తన వెనకన ఉన్న అర్జునునికి బోధ చేయటానికి, ఆ స్వామి తన తలని వెనక్కి తిప్పి, మెడని వెనుకకే ఆ వైపు త్రిప్పి బోధ చేసేడు కదా? ఆ రకంగా తల తన వెనక్కి తిప్పి, గీతను బోధించేటప్పుడు, ఆ కృష్ణుడికి .. నా స్వామికి ఎంతటి మెడనొప్పి వచ్చిందో, ఎంతలా మెడనొప్పిను స్వామి భరించేడో అని తలుచుకుని తలచుకుంటూ, నేను చాలా బాధపడుతున్నాను. అందుకే ధారాపాతంగా కన్నీళ్లు వస్తున్నాయి. ఇంకేం కాదు’’ అని తను అంతలా కన్నీరు కార్చేందుకు గల కారణాన్ని వివరించేడు కన్నీరు కారుస్తున్న వ్యక్తి.
అప్పుడు వెంటనే అంతా అర్థమైపోయింది రెండో ఆసామీకి. భగవంతుని కోసం, భగవంతుడు బాధపడుతున్నాడని బాధను అనుభవిస్తున్న అతనే, కంటీ మంటికీ ధారాపాతంగా భగవంతుడి కోసం ఏడుస్తున్న ఆ వ్యక్తే నిజమైన భక్తుడు. అతనిదే నిజమైన అసలు సిసలైన భక్తి అని గ్రహించేడు. నిర్ధారణకొచ్చేడు.
శ్రీకృష్ణుని ప్రేమతత్త్వాన్ని అనుభవిస్తూ, అందులో లీనమైనవాడే నిజమైన భక్తుడు.్భగవంతుడు సన్నివేశానుగుణంగా పడే అవస్థని అనుభవంలోకి తెచ్చుకున్నవాడే నిజమైన భక్తుడు. అతనిదే అసలు సిసలైన భక్తి అని గ్రహించేడు.
పఠించడం కాదు భక్తి అంటే! పాటించడం భక్తి. అలకించటం కాదు అనుభవించటం భక్తి.ప్రదర్శించటం కాదు భక్తి ప్రేమించటం భక్తి. భగవంతుడి కోసం వేదన పడటం భక్తి. వేగ పోవడం భక్తి. తపన పడటం భక్తి. తపించిపోవటం భక్తి.

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669