అంతర్జాతీయం

ఒబామా విందుకు ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చిన ‘కరస్పాండెంట్ డిన్నర్’కు బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో పదవీకాలం పూర్తికానున్న సందర్భంలో అధ్యక్షుడిగా ఇచ్చిన చివరి విందు కార్యక్రమానికి ఒబామా, మిషెల్ దంపతులు ప్రియాంకను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏటా జర్నలిస్టులు, ప్రొడ్యూసర్లు, కెమెరామెన్‌కు ఇచ్చే ఈ విందుకు విశేష ప్రాధాన్యం ఉంది. వైట్‌హౌస్ కార్యక్రమాలను కవర్‌చేసే వారికి అధ్యక్షుడు ఈ విందు ఇవ్వడం పరిపాటి. కాగా బేవాచ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రియాంక ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవచ్చని ప్రచారం జరిగింది. ‘ఈ సాయంత్రం ఒబామా, మిషెల్ దంపతులు ఇచ్చిన విందు ఆహ్లాదంగా, ఆనందంగా గడిచింది. ప్రభుత్వం ఉద్దేశించిన బాలికావిద్య కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వేచిచూడలేనంటూ’ కామెంట్‌తోపాటు ఒబామా, మిషెల్‌తో కలసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రియాంక విందుకు హాజరైన ఆహూతులను అలరించింది. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు హెలెన్ మిరెన్, జె.లితో, బ్రయాన్ కొన్‌స్టన్, విల్ స్మిత్, జెప్ గోల్డ్‌బ్లమ్, రాచెల్ మెక్‌అడమ్స్, హమ్ హిడిల్‌స్టన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా సేకరించే విరాళాలను జర్నలిస్టుల సంక్షేమంకోసం వెచ్చించడం ఆనవాయితీ.