పూరి బాలీవుడ్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనదైన స్టైల్‌తో సినిమాలు రూపొందిస్తూ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాధ్. ఇటీవలే ‘లోఫర్’ చిత్రాన్ని రూపొందించిన ఆయన ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో ‘రోగ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి హిందీలో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. హిందీలో ప్రముఖ నటుడు సంజయ్‌దత్ హీరోగా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయిందని సమాచారం. ఇటీవలే జైలునుంచి వచ్చిన సంజయ్‌దత్‌ను పూరి కలిశాడట. కథ విన్న సంజయ్‌దత్ చేయడానికి సుముఖత వ్యక్తంచేసినట్టు వార్తలొస్తున్నాయి. అప్పట్లో అమితాబ్‌బచ్చన్‌తో పూరి జగన్నాధ్ చేసిన ‘బుడ్డా హోగయా తేరే బాప్’ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇన్నాళ్లకి మళ్లీ హిందీలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు పూరి జగన్నాధ్. త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయి.