ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా జిల్లాలో పుష్కరాలకు 3 కోట్ల మంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా జిల్లాలో పుష్కరాలకు 3 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, శాటిలైట్ బస్సు, రైల్వే స్టేషన్‌లు ఏర్పాటు చేశామని కలెక్టర్ బాబు చెప్పారు. పుష్కరవిధుల్లో 60వేల మంది ఉద్యోగులు, 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. పుష్కరాలలో వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు. 1400 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, ఘాట్ల వద్ద ఫైరింజన్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ వివరించారు. ప్రతి 10 నిమిషాలకు ఓ బస్సు ఉంటుందని, ఒకేసారి ఎక్కువ మంది స్నానాలు చేసేలా కొత్త టెక్నాలజీని ప్రవేశపడతామని వెల్లడించారు. పవిత్ర సంగమంలో ఒకే సారి 2 లక్షల మంది స్నానాలు ఆచరించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. భక్తులందరికీ మంచినీరు, మజ్జిగ అందిస్తామని, పుష్కర నగర్‌లలో రోజుకు 7.5 లక్షల మందికి భోజన వసతి కల్పిస్తామన్నారు.