పజిల్

పజిల్-735

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.అయిదక్షరాల పేరుగల రెండు తెలుగు సంవత్సరాల్లో ఒకటి (5)
4.ఒక నక్షత్రము, కార్తీకమాసానికి చెందింది (3)
6.బీహారు రాష్ట్ర రాజధాని, వెనుక నించి (2)
7.విల్లు (3)
10.నెమిలి (2)
11.సంక్రాంతికి అమ్మాయిలు పోటీ పడి పెట్టేది (2)
12.దీనిపక్కన నిలువు 2 చేరితే తిట్టు (2)
15.‘సీతా’ ‘సావిత్రీ’ ఎత్తుగడల్లో బాటిలు (2)
16.చాగంటి సోమయాజులుగారు ఇలా ప్రసిద్ధులు (2)
19.చుట్టం లాంటివాడే! ‘తోడు’ అని అర్థం (2)
21.‘కథ చెబుతాను...’ (3)
23.గోమాయువు (2)
25.యజ్ఞోపవీతము (3)
26.అయిదక్షరాల పేరుగల రెండు తెలుగు సంవత్సరాల్లో మరొకటి (5)
*
నిలువు
*
2.వ్యాధి (2)
3.ప్రారంభోత్సవాల్లో కత్తిరించేది (3)
4.కృపాసహితమైన కత్తి (4)
5.వంకాయ తరిగి అలా బైట వుంచితే ఎక్కేది (3)
7.కొప్పుముడి ఆకర్ణికాంతర ... అన్నాడు పోతన (4)
8.వ,వా,వి,వీ .... (2)
9.పొరపాటు. అనుకోని ఆపద (3)
13.ఇది కట్టే పట్టు కాదు. పట్టే పట్టు (4)
14.దేవుడికి నైవేద్యం పెట్టినది మనకు... (3)
17.మెట్టు (4)
18.ఊలు (2)
20.అడ్డం 23లోదే! వెనుదిరిగింది (3)
22.కొరకుచు (3)
24.శత్రువుతో రాజీ (2)

నిశాపతి