పజిల్

పజిల్ -- 761

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.కర్నూలు జిల్లాలో ‘అహో’ అనిపించే
పుణ్యక్షేత్రం (5)
4.దీని పట్టు మహా గట్టి (3)
6.ఇది సరికాదు (2)
7.దట్టముగా పెరిగిన చెట్లు, పొదలు వగైరా (3)
10.పువ్వు (2)
11.ఇది లేని వస్తువు దొరకడం దుర్లభం
ఈ రోజుల్లో (2)
12.చవి (2)
15.పత్తి వడికిన పోగు (2)
16.రుణం ఎదురు తిరిగింది (2)
19.యుద్ధము, తగాదా (2)
21.్ఛందోగణాల్తో సమానత్వం (3)
23.జోడు (2)
25.మాయాబజారులో తల్పము వద్దు, ఇది కావాలి అన్నారు పెళ్లివారు (3)
26.మిక్కిలి శక్తివంతుడు. 1969 నాటి కృష్ణ, వాణిశ్రీల సినిమా (5)
*
నిలువు
*
2.దక్షిణాది వారి ప్రధాన ఆహార ద్రవ్యం (2)
3.అలంకరణ (3)
4.పచ్చడి పెట్టుకునే ఈ కాయ ‘సిరి’కి నిలయం (4)
5.ముక్కు మీద కోపము గలవాడు (3)
7.పూర్వం బంగారం తూకానికి ఈ గింజలు వాడేవారు (4)
8.శ్రీకృష్ణుడి బావమరిది (2)
9.కాటకం వంటిదే! (3)
13.‘తపోలత’ను సరిచేస్తే వచ్చే ఆలోచన (4)
14.ఇదీ, పలుకూ లేకుండా అంటారు (3)
17.‘అక్క’ ముందున్నది. ఆశ్చర్యము! (4)
18.పద్యంలో వృత్తాలకి వుండేది (2)
20.క్యారెట్ ఆకారంలోని ఒక తెల్లటి దుంప కూర (3)
22.మాహాత్మ్యము భూమిలోనే దీని మొదలు (3)
24.తల్లి, పార్వతి (2)