క్విజ్

బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.రవిశాస్ర్తీ 1985లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్‌లో ఏ ప్రతిష్ఠాత్మకమైన టైటిల్‌ని పొందేరు?
ఎ.మాస్టర్ ఆఫ్ క్రికెట్ బి.ది గ్రేట్ ఆల్‌రౌండర్
సి. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్‌షిప్
డి.క్రికెట్ మేజీషియన్
2.బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ ఫైనల్‌లో ఏ మోడల్ కారు రవిశాస్ర్తీకి బహుమతిగా ప్రదానం చేసేరు?
ఎ.కాడిలాక్ ఫ్లీట్వుడ్ బి.డైమ్లెర్ డిఎస్420
సి.ఆడి 100 డి.క్రిస్లర్ న్యూపోర్ట్
3.బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్‌లో భారత్ మరియు పాకిస్తాన్ కెప్టెన్లు ఎవరు?
ఎ.సునీల్ గవాస్కర్, ఇమ్రాన్‌ఖాన్
బి.కపిల్‌దేవ్, జావెద్ మియాందాద్
సి.సునీల్ గవాస్కర్, మియాందాద్
డి.కృష్ణమాచారి శ్రీకాంత్, ఇమ్రాన్‌ఖాన్
4.ఈ టోర్నమెంట్‌లో మూడవ స్థానం కోసం ప్లేట్ విన్నర్స్ ఫైనల్ అనే మ్యాచ్‌ని ఆడిన జట్లు ఏవి, ఎవరు మూడవ స్థానం గెల్చుకొన్నారు?
ఎ.వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్‌పై విజయం సాధించింది
బి.శ్రీలంకపై వెస్టిండీస్ విజయం సాధించింది
సి.శ్రీలంకపై న్యూజిలాండ్ గెలిచింది
డి.న్యూజిలాండ్, వెస్టిండీస్‌పై గెలిచింది
5.ఏ నగరాల్లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ మ్యాచ్‌లు నిర్వహించారు?
ఎ.సిడ్నీ, పెర్త్, అడిలైడ్ క్రికెట్ గ్రౌండ్స్
బి.మెల్‌బోర్న్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్
సి.మెల్‌బోర్న్, ఆడిలైడ్ ఓవల్ క్రికెట్ గ్రౌండ్స్
డి.పెర్త్, మెల్‌బోర్న్, సిడ్నీ
6.బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు పొందేరు?
ఎ.కృష్ణమాచారి శ్రీకాంత్
బి.ఎల్.శివరామకృష్ణన్
సి.కపిల్‌దేవ్
డి.జావెద్ మియాందాద్
7.బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్‌లో అప్పటి భారత టీం, ఏ భారత్ మాజీ కోచ్ (అప్పటికి అతను ఇంకా క్రికెటర్)తో తలపడింది?
ఎ.జాన్‌రైట్ బి.గ్రెగ్ చాపెల్
సి.గారి కిర్స్టన్, డంకన్ ఫ్లెచర్
డి.పైవన్నియు
8.బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్‌లో ఏ మాజీ భారత కోచ్ (అప్పటికి వారు ఇంకా క్రియాశీల క్రీడాకారులు) పాల్గొని ఆడేరు?
ఎ.మదన్‌లాల్
బి.రవిశాస్ర్తీ, కపిల్‌దేవ్
సి.జాన్‌రైట్
డి.పైవన్నియు
9.వెస్టిండీస్, ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియాలకు ఎవరు సారథ్యం వహించారు?
ఎ.క్లైవ్ లాయిడ్, డేవిడ్ గోవెర్ మరియు డేవిడ్ బూన్
బి.వివ్ రిచర్డ్స్, మైక్ గాటింగ్ మరియు అలెన్ బోర్డర్
సి.వివ్ రిచర్డ్స్, మైక్ గాటింగ్ మరియు డీన్ జోన్స్
డి.క్లైవ్ లాయిడ్, డేవిడ్ గోవర్ మరియు అలెన్ బోర్డర్
10.మొత్తం సిరీస్‌లో ఏ బౌలర్ ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు మరియు అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్?
ఎ.ఇమ్రాన్‌ఖాన్, రవిశాస్ర్తీ
బి.ఎల్.శివరామకృష్ణన్, కె.శ్రీకాంత్
సి.రిచర్డ్ హాడ్లీ, అజారుద్దీన్
డి.కపిల్‌దేవ్, అలెన్ లాంబ్

గత వారం క్విజ్ సమాధానాలు
1.బి 2.డి 3.సి 4.డి 5.డి 6.సి 7.డి 8.డి 9.డి 10.ఎ

-సునీల్ ధవళ 97417 47700