క్విజ్

సోషలిస్టు నేత లోహియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రైతులకు వ్యవసాయంలో వివిధ సమస్యల పరిష్కారానికి సహాయం చేయడానికి రామ్ మనోహర్ లోహియా ఏ సంస్థను స్థాపించారు?

ఎ.కిసాన్ మిత్ర సమాజ్
బి.భా రతీయ కిసాన్ సంఘ్
సి.హిందూ కిసాన్ పంచాయతీ
డి.్భరతీయ కిసాన్ సమైక్య యూనియన్

2.భా రతదేశపు గొప్ప స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరైన రామ్ మనోహర్ లోహియా 1910, మార్చి 23న జన్మించారు. స్థానిక ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఆందోళన, నిరసనోద్యమం 18 జూన్ 1946లో లోహియా చేపట్టినందుకు ఆయన జ్ఞాపకార్థం ఆ ప్రదేశానికి ఏ ఊరిలో ‘18 జూన్ రోడ్’ అని పేరు పెట్టారు?

ఎ.లాహోర్, పాకిస్తాన్
బి.మాండలే, బర్మా
సి.ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్
డి.పనాజి, గోవా

3.దేశ ప్రజల శ్రేయస్సు కొరకు, లోహియా చేసిన కృషి చిరకాలం భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆయన రాసిన పుస్తకమేది?

ఎ.వీల్ ఆఫ్ హిస్టరీ
బి.మార్క్స్, గాంధీ అండ్ సోషలిజం
సి.గిల్టీ మెన్ ఆఫ్ ఇండియాస్ పార్టీషన్
డి.పైవన్నియు

4.డా.రామ్ మనోహర్ లోహియా అక్టోబర్ 12, 1967లో మరణించారు. అతను తన పిహెచ్.డి. థీసిస్ ఏ విషయం మీద రాసి సమర్పించారు?

ఎ.భారతదేశంలో ఉప్పు మీద పన్ను వేయడం
బి.భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ వ్యాపార కార్యకలాపాల
సి.భారతదేశంలో అంటరానితనం
డి.భారతదేశంలో వస్తుమార్పిడి పద్ధతి

5.లోహియా తన జీవితాన్ని, సమయాన్ని భారతదేశం సంక్షేమం కొరకు అంకితం చేశారు. బ్రిటీషు వారు ఏ సందర్భంలో లోహియాని జైలుకి పంపారు?

ఎ.రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ రాయల్ ఆర్మీలోకి భారతీయులను నమోదుకి వ్యతిరేకంగా నిరసన చేసినందుకు
బి.గాంధీ నిర్వహించిన హరిజన్‌లో సత్యాగ్రహం మీద వ్యాసం రాసినందుకు
సి.క్విట్ ఇండియా ఉద్యమం పిలుపు సమయంలో
డి.పైవన్నియు

6.భారతదేశం నలుమూలల నుంచి ప్రజల గోడు, సమస్యలను పార్లమెంటులో వినడానికి ఒకరోజు కేటాయించాలని పట్టుబట్టిన లోహియా సఫలీకృతమయ్యారు. ఏ దినం పేరున పార్లమెంటులో ఈ సంప్రదాయం నడుస్తోంది?

ఎ.హమ్ లోగ్
బి.ప్రజా పార్లమెంట్
సి.జనవని దివస్
డి.పౌర సమస్యా దిన్

7.సామాజిక న్యాయం కోసం, కుల వివక్ష మరియు లింగ పక్షపాతం గూర్చి పోరాడిన లోహియా, ఏ ప్రదేశంలో నిషేధిత ప్రసంగం చట్టంపై వ్యతిరేకంగా మరియు స్థానికుల హక్కుల కోసం ఉద్యమం చేసి ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు?

ఎ.భీమిలిపట్నంలో డచ్ వారు
బి.పుదుచ్చేరీలో ఫ్రెంచ్ ప్రభువులు
సి.గోవాలో పోర్చుగీసు ప్రభుత్వం
డి.పైవన్నియు

8.ఫైజాబాద్‌లోని ఏ విశ్వవిద్యాలయం ‘డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం’గా మార్చబడింది?
ఎ.కింగ్ జార్జ్ విశ్వవిద్యాలయం

బి.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫైజాబాద్
సి.అవధ్ విశ్వవిద్యాలయం
డి.విల్లింగ్టన్ విశ్వవిద్యాలయం

9.సోషలిస్టు భావనలతో గూడిన వ్యక్తిత్వం, సోషలిస్టు సిద్ధాంతానికి అత్యంత ముఖ్యమైన ప్రతిపాదకుడు అయిన లోహియా ఏ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ చదివారు?

ఎ.అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఇండియా
బి.లొమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీ, రష్యా
సి.ఫెడ్రిక్ విలియం యూనివర్సిటీ, జర్మనీ
డి.కేంబ్రిడ్జ్, లండన్

10.న్యూఢిల్లీలోని ఏ ఆసుపత్రి పేరుని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిగా మార్చారు?
ఎ.ఎడ్వినా వౌంట్ బాటెన్ మెడికల్ సైనె్సస్

బి.లార్డ్ కర్జన్ హాస్పిటల్
సి.విల్లింగ్టన్ హాస్పిటల్
డి.సెయింట్ మేరీ హాస్పిటల్
*
గత వారం క్విజ్ సమాధానాలు

1.డి 2.సి 3.డి 4.డి 5.డి 6.సి 7.డి 8.డి 9.బి

-సునీల్ ధవళ 97417 47700