రాష్ట్రీయం

అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు రఘువీరా లేఖ
హైదరాబాద్, డిసెంబర్ 4: ఆంధ్రకు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిపిసిసి) అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. ఈ మేరకు రఘువీరారెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన అనివార్యమైనందున ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం చేసే ఉద్దేశంతో ఐదేళ్ళ పాటు ప్రత్యేక హోదా, అనేక ప్రయోజనాలను కల్పిస్తూ నాటి యుపిఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఆయన గుర్తు చేశారు. మీరు కూడా ప్రత్యేక హోదా 15 ఏళ్ళు కావాలని అడిగారని, రాజ్యసభలో బిజెపి ఎంపి వెంకయ్య నాయుడు 10 ఏళ్ళు కావాలని డిమాండ్ చేశారని, బిజెపి అధికారంలోకి వస్తే పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన చంద్రబాబుకు గుర్తు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజలు ఆశించిన విధంగా పురోగతి లేదని, ప్రజల్లో ఆందోళన, ఆవేదన పెరుగుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆంధ్రకు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు కోసం అనేక రకాలుగా ఒత్తిడి, ఆందోళనలు చేస్తున్నాయని ఆయన వివరించారు. కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అన్ని అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని కోరుతున్నానని పేర్కొన్నారు.