రెహమాన్ పోస్టర్‌కు అమీర్ ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రెహమాన్ నిర్మాతగా, స్క్రిప్ట్‌రైటర్‌గా కొత్త బాధ్యతలు చేపడుతూ నిర్మిస్తున్న ‘99 సాంగ్స్’ సినిమా పోస్టర్ అత్యద్భుతంగా ఉందని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా షూటింగ్ తొందరగా ప్రారంభం కావాలని అమీర్ ‘ట్విట్టర్’లో శుభాకాంక్షలు తెలిపాడు. అమీర్ నటించిన ‘రంగీలా’, ‘లగాన్’, ‘మంగళ్ పాండే’, ‘గజనీ’ సినిమాలకు రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. తన హిట్ చిత్రాలకు స్వరరచన చేసిన రెహమాన్‌ను అమీర్ ఎంతగానో అభిమానిస్తుంటాడు. వైఎం మూవీస్ బ్యానర్‌పై తొలిసారిగా తాను నిర్మిస్తున్న ‘99 సాంగ్స్’ పోస్టర్‌ను రెహమాన్ ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఉంచాడు. పియానోతో కలిసి ఓ ప్రేమజంట గాలిలో తేలియాడుతున్నట్లు రూపొందించిన ఆ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రెహమాన్ అందించే సంగీతం, స్క్రిప్ట్‌పై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. విశే్వష్ కృష్ణమూర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘స్వర మాంత్రికుడు’ నిర్మిస్తున్న ‘99 సాంగ్స్’ వచ్చే ఏడాది విడుదలవుతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా.