రాష్ట్రీయం

ఉత్తరాంధ్రలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం : ఉత్తరాంధ్ర జిల్లాలలోని పార్వతీపురం, కురుపాం, గజపతినగరం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, ఆముదాలవలస, శ్రీకాకుళంలో వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లాలోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం, బొబ్బిలిపట్టణాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షం పడుతోంది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. అలాగే విశాఖపట్నంలోని పాడేరు, తగరపువలస, విశాఖ నగరంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.