రాష్ట్రీయం

భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48గంటల్లో కర్నాటకలోని దక్షిణ ప్రాంతం, రాయలసీమ, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 12వ తేదీ వరకు కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మూడు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంవల్ల పలు ప్రాంతాల్లో తొలకరి వర్షాలు మొదలయ్యాయి.