రాష్ట్రీయం

గుంటూరు జిల్లాలో అకాల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటచింతల/ మాచవరం, మార్చి 13: గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలో ఆదివారం అకాల వర్షం కురవడంతో ఎండబెట్టిన మిరపకాయలు తడిసిపోయాయి. వర్షాకాలంలో చినుకు లేకపోగా ఎండాకాలంలో వర్షం పడదులే అని రైతులు అజాగ్రత్తగా ఉండటంతో క్షణాల్లో మబ్బుపట్టి వడగళ్ల వాన కురిసింది. రైతులు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఆదరాబాదరా పట్టాలు తెచ్చి పరిచేలోపే మిరపకాయలు తడిసిపోయాయి. ఇదిలావుంటే, మాచవరం ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అప్పటివరకు విపరీతమైన ఎండకాసి అరగంట సమయంలోనే ఆకాశంలో మబ్బులు పట్టి వాతావరణం చల్లబడింది. దీంతో కొద్దిసేపటికే ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు పడటంతో పొలాల్లో ఎండబెట్టిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు తంటాలుపడ్డారు.