రజనీ మహాదేవ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కబాలీ’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రాధికా ఆప్టే నటిస్తోంది. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. మలేసియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో రజనీకాంత్ మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఒక డాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో ‘మహాదేవ’ అనే టైటిల్‌ను పెడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రజనీకాంత్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తరువాత రజనీకాంత్ నటించే ‘రోబో-2’ ఈనెల 12న ప్రారంభం కానుంది.